Viral: తాళం లాక్కుని కార్లో కూర్చున్న 3 ఏళ్ల కొడుకు.. పొరపాటున లాక్ బటన్ నొక్కడంతో డోర్లు బంద్.. చివరకు..!
ABN , First Publish Date - 2023-07-24T15:47:25+05:30 IST
ఆ వ్యక్తి తన కొడుకును తీసుకువచ్చేందుకు కారులో వెళ్లాడు.. కొడుకును తీసుకుని బయటకు వచ్చాడు.. ఇంతలో ఆ బాలుడు తండ్రి చేతిలోని కారు తాళం తీసుకున్నాడు.. కారు ఎక్కేసి లాక్ చేసుకున్నాడు.. తలుపు తీయడానికి ప్రయత్నించినా అది రాలేదు.. ఏం చేయాలో అతడికి అర్థం కాలేదు..
ఆ వ్యక్తి తన కొడుకును తీసుకువచ్చేందుకు కారు (Car)లో వెళ్లాడు.. కొడుకును తీసుకుని బయటకు వచ్చాడు.. ఇంతలో ఆ బాలుడు తండ్రి చేతిలోని కారు తాళం (Car Key) తీసుకున్నాడు.. కారు ఎక్కేసి లాక్ చేసుకున్నాడు (child got locked in the car).. తలుపు తీయడానికి ప్రయత్నించినా అది రాలేదు.. ఏం చేయాలో అతడికి అర్థం కాలేదు.. కారులో ఉన్న బాలుడు ఊపిరి ఆడక బాధపడడం గమనించాడు.. వెంటనే ఏమీ ఆలోచించకుండా కారు అద్దాలను పగలగొట్టి కొడుకును బయటకు తీశాడు (Viral News).
లూథియానాకు (Ludhiana) చెందిన సుందర్‌దీప్ సింగ్ తన కొడుకు కబీర్‌ను తీసుకురావడానికి ప్రీ-స్కూల్‌కు వెళ్లాడు. బయటకు వచ్చాక ఆ చిన్నారి తండ్రి చేతిలోని కారు తాళం తీసుకున్నాడు. కబీర్‌ను వెనుక సీట్లో కూర్చోబెట్టి సుందర్ దీప్ ముందుకు వెళ్లాడు. ఆ కొద్ది సెకెన్ల వ్యవధిలోనే కబీర్ లాక్ బటన్ ప్రెస్ చేయడంతో కారు లాక్ అయిపోయింది. బయట ఉన్న సుందర్ దీప్ డోరు తీయడానికి అవలేదు. దీంతో ఏం చేయాలో అతడికి అర్థం కాలేదు. వెంటనే తన తమ్ముడికి ఫోన్ చేశాడు. చుట్టు పక్కల వారి సహాయం తీసుకున్నాడు. అయినా డోరు మాత్రం బయటకు రాలేదు (Car door Locked).
Crime: మీ భర్త గురించి సీక్రెట్ చెబుతానని పిలిచాడు.. నమ్మి వెళ్లిన మహిళకు నరకం చూపించాడు.. అసలేం జరిగిందంటే..
అప్పటికే 15 నిమిషాల సమయం వృథా అయిపోయింది. లోపల వేడి, ఊపిరి ఆడక ఆ చిన్నారి తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. లోపల ఒక్కడే ఉండి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. ఇక, సమయం వేస్ట్ చేస్తే చాలా ప్రమాదం జరుగుతుందని భావించి సుందర్ దీప్ ఓ పెద్ద కర్రతో కారు అద్దాలను బద్దలుగొట్టేశాడు. దీంతో కబీర్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తనకు ఎదురైన పరిస్థితి చాలా భయంకరమైనదని, తల్లిదండ్రులు అందరికీ ఇదొక గుణపాఠం అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.