Health Tips: ఆరోగ్యకరమైన, రుచికరమైన నీటికోసం 5 చిట్కాలు
ABN , First Publish Date - 2023-06-16T18:09:34+05:30 IST
హైడ్రేటెడ్‌గా ఉండడం చాలాముఖ్యమనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు తాగే ప్రతి గ్లాస్ నీటిని రుచిగా ఉండే విధంగా ఎలా మార్చుకోవాలో తెలుసా? ఏమేం కలిపితే మనం తాగేనీటికి రుచి వస్తుంది. మనం తాగే ప్రతి గ్లాస్ వాటర్‌ను రుచిగా మార్చుకునే కోన్ని చిట్కాలు మీకోసం..

దోసకాయ ముక్కలు(Cucumber Slices)
ఒక ముక్క నిమ్మరసం, దోసకాయ ముక్కలు మనం తాగే నీటిలో కలిపితే చాలు.. వెంటనే ఆరోగ్యకమైన, తాగిన వెంటనే తాజాగా ఉంచే పానీయం సిద్ధం మవుతుంది.
తాజా పండ్లు(Fresh fruit)
ఓ బాటిల్ నీటిలో నారింజ లేదా పైనాపిల్స్ వంటి తాజా పండ్ల ముక్కలను జోడించినట్లయితే రుచికరమైన పానీయం రెడీ అవుతుంది.
ఫ్రిజ్‌లో ఉంచిన బెర్రీలు(Freezen Berries)
కొన్ని బెర్రీలను ఫ్రీజ్‌లో ఉంచినట్లయితే ఫ్రూట్‌లిసియుస్ ఐస్ క్యూబ్‌లు తయారవుతాయి. వీటిని గ్లాసు నీటికి జోడించినట్లయితే మంచి హైడ్రేటెడ్ డ్రింక్ రెడీ అవుతుంది.
గులాబీ రేకులు(Rose Petals)
మీరు తాగే నీటిలో కొన్ని గులాబీ రేకులను జోడించి రోజంతా సిప్ చేస్తూ ఉండండి.. మీలో తాజాదనం ఫీలింగ్ ఉంటుంది. కానీ గులాజీ రేకులను శుభ్రంగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి.
పుదీనా ఆకులు(Mint leaves)
పుదీనా ఆకులు కూడా మీరు తాగే నీటికి రుచిని జోడిస్తాయి. తాగేనీటిలో కొన్ని పుదీనా ఆకులను వేసి తాగితే ఎంతో రుచిగా ఉంటాయి.