Viral: నా ప్రేమికుడు మోసం చేశాడు.. 63 ఏళ్ల వృద్ధురాలు ఇచ్చిన కంప్లైంట్ విని అవాక్కైన పోలీసులు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-08-22T12:31:42+05:30 IST

యుక్త వయసులో ప్రేమలో పడడం, మోసపోవడం వంటివి చాలా మంది జీవితాల్లో జరుగుతుంటాయి. కానీ, వయసు మళ్లాక 63 ఏళ్ల వయసులో ప్రేమలో పడి ప్రియుడితో వెళ్లిపోయిన ఓ బామ్మ పోలీసులకు షాకిచ్చింది. 73 ఏళ్ల తన ప్రియుడు తనను మోసం చేసి నడిరోడ్డు మీద వదిలేశాడని వాపోయింది.

Viral: నా ప్రేమికుడు మోసం చేశాడు.. 63 ఏళ్ల వృద్ధురాలు ఇచ్చిన కంప్లైంట్ విని అవాక్కైన పోలీసులు.. అసలేం జరిగిందంటే..

యుక్త వయసులో ప్రేమ (Love)లో పడడం, మోసపోవడం (Cheating) వంటివి చాలా మంది జీవితాల్లో జరుగుతుంటాయి. కానీ, వయసు మళ్లాక 63 ఏళ్ల వయసులో ప్రేమలో పడి ప్రియుడితో వెళ్లిపోయిన ఓ బామ్మ పోలీసులకు షాకిచ్చింది. 73 ఏళ్ల తన ప్రియుడు తనను మోసం చేసి నడిరోడ్డు మీద వదిలేశాడని వాపోయింది. అవాక్కైన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. బెంగళూరు (Bengaluru)లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది (Old woman cheated by lover).

హలసూరుకు చెందిన 63 ఏళ్ల వృద్ధురాలు ఓ బ్యాంక్ మేనేజర్ ఇంట్లో వంటమనిషిగా చేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు, మనవలు ఉన్నారు. భర్త చాలా ఏళ్ల క్రితమే మరణించాడు. కొడుకు ఇంట్లో ఉంటూ ఆమె పని చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు లోక్‌నాథ్ అనే 73 ఏళ్ల వృద్ధుడు పరిచయమయ్యాడు. ఆ ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి షికార్లకు వెళ్లేంత వరకు వచ్చింది. లోక్‌నాథ్‌కు కూడా భార్య లేదు. దీంతో తనతో పాటు వచ్చేస్తే ఏ కష్టాలూ లేకుండా బాగా చూసుకుంటానని ఆ మహిళను నమ్మించాడు.

Viral Video: బాబోయ్.. జిరాఫీకి కోపం వస్తే ఇలాగే ఉంటుందేమో.. టూరిస్ట్‌లను ఎంత దూరం తరిమిందో చూడండి..

కుమారుడు వద్దన్నా పట్టించుకోకుండా ఆ మహిళ తన ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది. కొన్ని రోజులు బాగానే చూసుకున్న లోక్‌నాథ్ ఆ తర్వాత ఆమెను హింసించడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పాడు. గట్టిగా అడిగితే కొట్టడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటివి చేస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 73 ఏళ్ల తన ప్రియుడిపై చీటింగ్ కేసు పెట్టింది.

Updated Date - 2023-08-22T12:36:43+05:30 IST