Viral: 80 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు.. 40 ఏళ్ల క్రితం చేసిన నేరానికి 4 దశాబ్దాల తర్వాత శిక్ష విధించిన కోర్టు..!

ABN , First Publish Date - 2023-09-20T15:45:32+05:30 IST

ఆ వ్యక్తి వయసు 80 ఏళ్లు.. 40 ఏళ్ల క్రితం అతడు తన అన్నయ్యను హత్య చేసినట్టు అభియోగం నమోదైంది.. ఈ కేసులో విచారణ 39 ఏళ్ల క్రితం ప్రారంభమైంది.. హత్యానంతరం ఆ వ్యక్తిని అరెస్టు చేసి కొన్ని నెలల తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.. అప్పట్నుంచి రకరకాల కోర్టుల్లో విచారణ జరుగుతూనే ఉంది..

Viral: 80 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు.. 40 ఏళ్ల క్రితం చేసిన నేరానికి 4 దశాబ్దాల తర్వాత శిక్ష విధించిన కోర్టు..!

ఆ వ్యక్తి వయసు 80 ఏళ్లు.. 40 ఏళ్ల క్రితం అతడు తన అన్నయ్యను హత్య చేసినట్టు అభియోగం నమోదైంది.. ఈ కేసులో విచారణ 39 ఏళ్ల క్రితం ప్రారంభమైంది.. హత్యానంతరం ఆ వ్యక్తిని అరెస్టు చేసి కొన్ని నెలల తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.. అప్పట్నుంచి రకరకాల కోర్టుల్లో విచారణ జరుగుతూనే ఉంది.. చివరకు ఆ కేసులో 40 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది.. ఆ వ్యక్తిని దోషిగా కోర్టు నిర్ధారించింది.. 80 ఏళ్ల వయసులో ఉన్న ఆ వ్యక్తికి జీవిత ఖైదు (Life Imprisonment ) విధించింది.

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని అలీగఢ్‌‌కు చెందిన 80 ఏళ్ల జైపాల్ సింగ్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. రూ.20 వేలు జరిమానా కూడా కట్టాలని ఆదేశించింది. తన అన్నయ్య రఘునాథ్‌తో వ్యవసాయ భూమి విషయంలో తలెత్తిన వివాదంలో జైపాల్ నిందితుడు. 1983 జూన్ 3వ తేదీ ఉదయం రఘునాథ్ ఇంటికి వెళ్తుండగా అడ్డగించిన జైపాల్ కర్రతో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో మరుసటి రోజు అలీఘర్‌లోని జెఎన్ మెడికల్ కాలేజీలో రఘునాథ్ మరణించాడు. రఘునాథ్ భార్య చంద్రముఖి కేసు పెట్టింది. మరిదిపై న్యాయపోరాటం ప్రారంభించింది (Crime News).

College Girl: కాలేజీకి వెళ్లిన కూతురు తిరిగి రాలేదేంటని తల్లిదండ్రుల్లో టెన్షన్.. సాయంత్రం 6 గంటలకు మోగిన తండ్రి ఫోన్.. లిఫ్ట్ చేస్తే..!

హత్య జరిగిన వెంటనే జైపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలల తర్వాత జైపాల్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అనంతరం అలహాబాద్ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. అయినా చంద్రముఖి తన పోరాటం ఆపలేదు. స్టే అయిపోయిన వెంటనే జిల్లా కోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ అనంతరం జిల్లా జడ్జి తాజాగా తుదితీర్పును వెలువరించారు. జైపాల్‌కు జీవిత ఖైదు విధించారు. రూ.20 వేల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించారు.

Updated Date - 2023-09-20T15:50:15+05:30 IST