Shocking News: 9వ తరగతి బాలుడు ఆత్మహత్య.. కారణమేంటా అని ఆరా తీస్తే బయటపడ్డ ఇద్దరమ్మాయిల నిర్వాకం..!

ABN , First Publish Date - 2023-10-06T15:54:41+05:30 IST

ప్రస్తుతం ఏ సమస్యకైనా చాలా మంది ఆత్మహత్యనే పరిష్కారంగా ఎంచుకుంటున్నారు. చిన్న వాళ్లు, పెద్ద వాళ్లు అనే తేడా లేకుండా ప్రతి చిన్న సమస్యకూ తల్లడిల్లిపోతున్నారు. తాజాగా హర్యానాకు చెందిన ఓ 9 ఏళ్ల బాలుడు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుని చనిపోయాడు.

Shocking News: 9వ తరగతి బాలుడు ఆత్మహత్య.. కారణమేంటా అని ఆరా తీస్తే బయటపడ్డ ఇద్దరమ్మాయిల నిర్వాకం..!

ప్రస్తుతం ఏ సమస్యకైనా చాలా మంది ఆత్మహత్యనే పరిష్కారంగా ఎంచుకుంటున్నారు. చిన్న వాళ్లు, పెద్ద వాళ్లు అనే తేడా లేకుండా ప్రతి చిన్న సమస్యకూ తల్లడిల్లిపోతున్నారు. ఆవేశంలో అనాలోచిత నిర్ణయం తీసుకుని అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు. తాజాగా హర్యానా (Haryana)కు చెందిన ఓ 9 ఏళ్ల బాలుడు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుని చనిపోయాడు. స్కూల్‌లోని విద్యార్థినులు ఏడిపించారనే కారణంతో ఉరేసుకుని చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది (Crime News).

హర్యానా రాష్ట్రంలోని హిసార్‌కు చెందిన ఓ బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు (9th class boy). అదే తరగతికి చెందిన ఇద్దరు బాలికలు (Girl Students) ఆ బాలుడిని కొద్ది రోజులుగా ఏడిపిస్తున్నారు (Teasing). ఆడపిల్లలా ప్రవర్తిస్తున్నావంటూ మాటలతో ఆ బాలుడిని వేధిస్తున్నారు. ఆ మాటలను ఆ బాలుడు తట్టుకోలేకపోయాడు. ఆ బాలికల గురించి స్కూల్ టీచర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. ఆ టీచర్ ఆ బాలికలపై చర్య తీసుకోకపోగా ఆమె కూడా ఆ బాలుడిని ఏడిపించింది.

Money: బ్యాంకు లెక్కల్లో తేడా.. రూ.41 లక్షలు తగ్గినట్టు గుర్తించిన మేనేజర్.. అనుమానం వచ్చి సీసీ కెమెరాల్లో చెక్ చేస్తే..!

తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు సెప్టెంబర్‌ 30 తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. స్కూల్‌లోని ఇద్దరు బాలికలతో పాటు ఓ టీచర్‌ కూడా తమ కుమారుడ్ని ఇబ్బంది పెట్టేదని తల్లి ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Updated Date - 2023-10-06T15:54:41+05:30 IST