Viral News: వర్షం వస్తోందని నెమ్మదిగా వెళ్తున్నా.. సడన్‌గా కుంగిన రోడ్డు.. సర్కారుపై నెటిజన్ల సెటైర్లు మామూలుగా లేవుగా..!

ABN , First Publish Date - 2023-07-04T15:21:11+05:30 IST

నాణ్యత లేకుండా వేసిన రోడ్లు వర్షా కాలంలో పాడైపోవడం మన దేశంలో సర్వ సాధారణమే. రోడ్ల మధ్యలో గుంతలు ఏర్పడి, వాటిల్లో నీళ్లు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడడం కూడా మనం నిత్యం చూసేదే. అయితే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మాత్రం ఓ కారు ఏకంగా రోడ్డు లోపలికే దూసుకుపోయింది.

Viral News: వర్షం వస్తోందని నెమ్మదిగా వెళ్తున్నా.. సడన్‌గా కుంగిన రోడ్డు.. సర్కారుపై నెటిజన్ల సెటైర్లు మామూలుగా లేవుగా..!

నాణ్యత లేకుండా వేసిన రోడ్లు (Roads) వర్షా కాలంలో (Rainy Season) పాడైపోవడం మన దేశంలో సర్వ సాధారణమే. రోడ్ల మధ్యలో గుంతలు ఏర్పడి, వాటిల్లో నీళ్లు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడడం కూడా మనం నిత్యం చూసేదే. అయితే ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాజధాని లక్నో (Lucknow)లో మాత్రం ఓ కారు (Car)ఏకంగా రోడ్డు లోపలికే దూసుకుపోయింది. ఉన్నట్టుండి రోడ్డు కుంగడంతో రోడ్డు సగం వరకు లోపలికి వెళ్లిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు యూపీ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు.

@ranvijaylive అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక కారు సగం వరకు భూమి లోపలికి వెళ్లిపోయింది. వర్షం వస్తుండడంతో ఆ కారు నెమ్మదిగానే వెళ్తోంది. అయినా నాణ్యత లేని రోడ్డు తేలికపాటి వర్షానికే కుంగిపోయింది. దీంతో కారు రోడ్డు లోపలికి వెళ్లిపోయింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ (Viral Photo) కావడంతో యూపీ ప్రభుత్వ (UP Government) తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు ఆ వీడియోపై సెటైర్లు వేస్తున్నారు.

Bulls Fight: రెండు ఆంబోతుల ఫైటింగ్.. సడన్‌గా వాటి మధ్యలోకి మరో ఆంబోతు ఎంట్రీ.. మూడూ కలిసి కారు ఓనర్‌కు భారీ షాకిచ్చాయ్..!

``ఉత్తరప్రదేశ్‌లో భూమి లోపలి వరకు అభివృద్ధి జరిగింది``, ``మీరు లక్నోలో ఉన్నారు.. నవ్వుకోండి``, ``అభివృద్ధి భూమిని చీల్చుతోంది``, ``రాజధాని నగరంలోనే అలా ఉంటే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో రోడ్ల గతి ఏమిటో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-07-04T15:21:11+05:30 IST