Viral News: ఈ వ్యక్తిని చూసి ఎగతాళి చేసినోళ్లే నోరెళ్లబెట్టారు.. ఓ చిన్న పరికరంతోనే ఏకంగా రూ.1.30 కోట్లు సంపాదించాడు..!
ABN , First Publish Date - 2023-04-06T17:34:48+05:30 IST
అప్పుడప్పుడు మురికి కాలువల్లోనూ.. రోడ్లపై కొంతమంది జల్లిస్తూ కనిపిస్తుంటారు. వాళ్లను చేసి పనీపాట లేదా? ఏంటి? అనుకుంటాం. కానీ దాని శ్రమ వెనుక చాలా కథే ఉంది. బహుశా చాలా మందికి అలా ఎందుకు చేస్తున్నారో తెలియక
అప్పుడప్పుడు మురికి కాలువల్లోనూ.. రోడ్లపై కొంతమంది జల్లిస్తూ కనిపిస్తుంటారు. వాళ్లను చేసి పనీపాట లేదా? ఏంటి? అనుకుంటాం. కానీ దాని శ్రమ వెనుక చాలా కథే ఉంది. బహుశా చాలా మందికి అలా ఎందుకు చేస్తున్నారో తెలియక పొరబడుతుంటారు. కానీ ఆ కష్టం వెనుక చాలా పెద్ద లాభమే ఉంది. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
మనం నిత్యం తిరిగే రోడ్లపై ఇసుక రవ్వల్లో గోల్డ్ దొరుకుతుంటుంది. దాని కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొంత మంది మనుషులు అదే పనిలో నిమగ్నమై ఉంటారు. ఇసుకను జల్లెడ పట్టి బంగారాన్ని సంపాదిస్తుంటారు. ఇలాంటి సంఘటనే ఆస్ట్రేలియా (Australia)లో చోటుచేసుకుంది.
అది ఆస్ట్రేలియాలోని బెండిగో-బల్లారత్ నగరాల మధ్యన ఉన్న గోల్డెన్ ట్రయాంగిల్ అనే ఏరియా. ఆ ప్రాంతం బంగారు నిధులకు ప్రసిద్ధి చెందింది. అక్కడ చాలా మందికి బంగారం దొరికిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి కూడా అదే ప్రయత్నం చేశాడు. అందుకోసం ఓ మెటల్ డిటెక్టర్(Metal detector) ను చేతపట్టి ఆ ప్రాంతంలో వెతకడం ప్రారంభించాడు.
అయితే కొంత మంది అతడిని.. అతని చేతిలోని డిటెక్టర్‌ని చూసి చాలామంది హేళన చేశారు. ఈ చిన్న డిటెక్టర్‌తో బంగారం పట్టేద్దామనే అంటూ ఎగతాళి చేశారు. అయినా కూడా అతడు నిరాశ చెందక అదే పనిగా తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. అలా వెతుకుతూ ఉండగా ఓ రోజు మెటల్ డిటెక్టర్ నుంచి శబ్దం వచ్చింది. వెంటనే ఆ ఏరియాలో తవ్వి చూసాడు. సుమారు నాలుగున్నర కేజీల బరువున్న ఓ రాయి (man found) కనిపించింది. దాని రంగు చూస్తే అందులో తప్పకుండా బంగారం (gold) ఉంటుందని భావించాడు. వెంటనే ఆ రాయిని తీసుకుని ఓ గోల్డ్ షాపుకు తీసుకెళ్లి చెక్ చేయించాడు. అంతే అతని అన్వేషణ ఫలించింది. ఆ రాయి బంగారమే అని తేల్చాడు. బంగారం లాంటి వార్త చెప్పాడంటూ ఎగిరి గంతులేశాడు. ఆ రాయిలో సుమారు రెండున్నర కిలోల వరకూ బంగారం ఉంటుందని చెప్పాడు. అదే అతనికి కోట్లు (crore rupees) తెచ్చిపెట్టింది. డారెన్ క్యాంప్ అనే వ్యక్తి కోటి 30 లక్షల రూపాయలకు దాన్ని కొనుగోలు చేశాడు. ఇలాంటి ఘటనలు చాలా అరుదని ఆ వ్యాపారి తెలిపాడు.
ఇది కూడా చదవండి: Viral News: ఎర్రగా కనిపిస్తున్న దీన్ని చూసి వజ్రమేమో అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. అసలు ఇదేంటో కలలో కూడా ఊహించలేరు..!