Viral video: సైకిల్‌ను కాదు.. జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు.. యువకుడి అద్భుత ట్యాలెంట్‌పై నెటిజన్ల కామెంట్లు!
ABN , First Publish Date - 2023-10-06T18:52:58+05:30 IST
కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఆకలి ఎంతటి కష్టాన్నైనా భరించే శక్తినిస్తుంది. అంతేకాదు అద్బుతమైన ట్యాలెంట్‌ను కూడా అలవర్చుకునేలా చేస్తుంది. తాజాగా ఈజిప్టులోని కైరోలో ఓ యువకుడి ఫీట్ చూస్తే ఔరా అనక తప్పదు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఆకలి ఎంతటి కష్టాన్నైనా భరించే శక్తినిస్తుంది. అంతేకాదు అద్బుతమైన ట్యాలెంట్ (Talent)ను కూడా అలవర్చుకునేలా చేస్తుంది. తాజాగా ఈజిప్టు (Egypt)లోని కైరోలో ఓ యువకుడి ఫీట్ చూస్తే ఔరా అనక తప్పదు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ కుర్రాడి ట్యాలెంట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. bicyclefilmfestival అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుర్రాడు సైకిల్ (bicycle) మీద వెళ్తున్నాడు. ఆ కుర్రాడి తలపై బ్రెడ్ల (Breads)తో నిండిన రెండు పొడవైన ట్రేలు ఒకదానిపై ఒకటి అమర్చి ఉన్నాయి. ఆ కుర్రాడు కనీసం ఆ సైకిల్ హ్యాండిల్ కూడా పట్టుకోకుండా తొక్కుతున్నాడు. కార్లు, ఇతర వాహనాలు తిరుగుతున్న ఆ రోడ్డుపై ఆ కుర్రాడు తన సైకిల్‌ను బ్యాలెన్స్ చేస్తున్న విధానం ఆకట్టుకుంటోంది. సైకిల్ మీదే ఆ కుర్రాడు ఈజిప్టులోని కైరో (Cairo)లో బ్యాకరీలకు బ్రెడ్‌లను సప్లై చేస్తున్నాడు. ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.
Apple: యాపిల్ కొత్త అప్‌డేట్ తెచ్చిన తంటా.. తన పేరును మార్చుకున్న యువతి.. అసలు కథేంటో తెలిస్తే..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 29 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఆ కుర్రాడి ట్యాలెంట్ అమోఘం``, ``సైకిల్‌ను కాదు.. జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు..``, ``అవసరం ఎన్ని విద్యలైనా నేర్పుతుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.