Shocking Video: అబ్బ.. ఎంత పెద్దదో.. అంటూ బండిని ఆపి మరీ ఖడ్గ మృగాన్ని ఫొటోలు తీశారు.. అంతే మరుక్షణంలోనే ఊహించని సీన్..!

ABN , First Publish Date - 2023-02-27T16:48:57+05:30 IST

కొన్నేళ్ల కిందట ఢిల్లీ జూపార్కు (Delhi Zoo Park)లో జరిగిన భయానకమైన సంఘటన గుర్తుందా?. ఓ తుంటరి కుర్రాడు పులి బోనులోకి దూకి టైగర్‌ (Tiger) కు

Shocking Video: అబ్బ.. ఎంత పెద్దదో.. అంటూ బండిని ఆపి మరీ ఖడ్గ మృగాన్ని ఫొటోలు తీశారు.. అంతే మరుక్షణంలోనే ఊహించని సీన్..!
ఊహించని సీన్..!

కొన్నేళ్ల కిందట ఢిల్లీ జూపార్కు (Delhi Zoo Park)లో జరిగిన భయానకమైన సంఘటన గుర్తుందా?. ఓ తుంటరి కుర్రాడు పులి బోనులోకి దూకి టైగర్‌ (Tiger) కు ఆహారం అయిపోయాడు. అందరూ చూస్తుండగానే పులి అతడి ప్రాణాలు తీసింది. ఇప్పుడెందుకు ఆ దారుణమైన సంఘటనను గుర్తుచేస్తున్నాననే కదా? మీడౌట్.. అయితే ఇది చదవాల్సిందే.

ఎవరికైనా సింహాన్ని గానీ.. ఏనుగును గానీ.. ఖడ్గ మృగాలను దగ్గర నుంచి చూడాలని ఆశ ఉంటుంది. పిల్లలతో జూపార్కులకు వెళ్లి చూస్తొస్తాం. చూడడం వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పరిధి దాటితేనే ముప్పువస్తుంది. ఇలానే ముచ్చటపడిన కొందరు అడవిలోకి సఫారీకి వెళ్లారు. సఫారీలో సరదాగా తిరుగుతూ కనిపించిన జంతువుల్ని ఫొటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతే ఉన్నట్టుండి కథ అడ్డం తిరిగింది. వ్యాన్‌పై తిరుగుతుండగా హఠాత్తుగా ఖడ్గ మృగాల (rhino) గుంపు ఎదురైంది. ఏమి చేయవు అనుకున్నారో.. ఏమో తెలియదు గానీ అదే పనిగా ఫొటోలు తీసుకుంటూ ముచ్చట పడుతున్నారు. అంతే మరుక్షణంలో సీన్ రివర్స్ అయిపోయింది. నన్నే ఫొటోలు తీస్తార్రా.. మీ సంగతి చూస్తానంటూ ఓ ఖడ్గమృగం ఉరుముకుంటూ మీదకొచ్చింది. అంతే ఈ ఊహించని పరిణామంతో బెంబేలెత్తిపోయిన డ్రైవర్... వ్యాన్‌ (Van) ను వేగంగా వెనక్కి పోనిచ్చాడు.. ఎక్కడికి పారిపోతార్రా అంటూ అమాంతంగా ఖడ్గమృగం వ్యాన్‌పైకి దూసుకొచ్చింది. కొమ్ముతో వాహనాన్ని ఢీకొట్టగానే ఫల్టీలు కొట్టుకుంటూ కిందపడిపోయింది. దీంతో వాహనం మీద పడటంతో టూరిస్టులు గాయాలతో బయటపడి ఊపరి పీల్చుకున్నారు. వాహనాన్ని ఢీకొట్టి ఖడ్గమృగం (rhino) అడవిలోకి వెళ్లిపోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. అదే స్పీడ్‌లో పర్యాటకులపై దాడి చేసుంటే ప్రాణాల్లో గాల్లో కలిసిపోయేవి.

ఇది కూడా చదవండి: ఓటమి భారం.. దానికి తోడు పక్కనున్నవాళ్లు నవ్వారని అవమాన భారం.. భరించలేక అతడు ఎంతకు తెగించాడంటే..

దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ (Indian Forest) సర్వీస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. వైల్డ్ లైఫ్ సఫారీల్లో పర్యటిస్తున్నప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ వీడియో చెబుతోందని ఆయన గుర్తుచేశారు. అడవి జంతువుల గోప్యతకు భంగం కలిగించకూడదని హెచ్చరించారు. పైగా ఆత్మరక్షణ లేకుండా ఇలాంటి సఫారీలకు వెళ్లొద్దని సూచించారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ఆపద కలగకపోవడం సంతోషమని చెప్పుకొచ్చారు. అయినా కూడా అన్ని సందర్భాల్లో ఇలాంటి అదృష్టం ఉండక పోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-02-27T16:49:30+05:30 IST