Shocking: కోడి రక్తాన్ని చూపించి రూ.3 కోట్లు కొల్లగొట్టారు.. ఈ మహిళ తెలివి ముందు దేశముదుర్లు కూడా బలాదూర్..!

ABN , First Publish Date - 2023-07-18T15:56:24+05:30 IST

ఆమె సాధారణ మహిళ కాదు.. అసాధారణ తెలివితేటలతో ఓ బడా వ్యాపారవేత్తనే బురిడీ కొట్టించింది.. అతడిని బెదిరించి ఏకంగా 3 కోట్లు కొల్లగొట్టింది.. అంతటితో సంతృప్తి చెందకుండా మరింత డిమాండ్ చేయడంతో పోలీసులకు దొరికిపోయింది.. ఆమె తెలివితేటలకు మాత్రం షాకవకుండా ఉండలేరు.

Shocking: కోడి రక్తాన్ని చూపించి రూ.3 కోట్లు కొల్లగొట్టారు.. ఈ మహిళ తెలివి ముందు దేశముదుర్లు కూడా బలాదూర్..!

ఆమె సాధారణ మహిళ కాదు.. అసాధారణ తెలివితేటలతో ఓ బడా వ్యాపారవేత్తనే బురిడీ కొట్టించింది.. అతడిని బెదిరించి ఏకంగా 3 కోట్లు కొల్లగొట్టింది.. అంతటితో సంతృప్తి చెందకుండా మరింత డిమాండ్ చేయడంతో పోలీసులకు దొరికిపోయింది.. ఆమె తెలివితేటలకు మాత్రం షాకవకుండా ఉండలేరు. కేవలం కోడి రక్తం (Chicken Blood)ఉపయోగించి ఆమె అంత పెద్ద క్రైమ్‌కు పాల్పడింది. మహారాష్ట్ర (Maharashtra)లోని కొల్హాపూర్‌కు చెందిన 64 ఏళ్ల వ్యాపారవేత్త 2021లో మోనిక అనే మహిళపై, ఆమె ఇద్దరు అనుచరులపై కేసు పెట్టాడు. తనను ట్రాప్ చేసి రూ.3.26 కోట్లు దోపిడీ చేశారని సహార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు (Crime News).

బాధిత వ్యాపారవేత్త 2016లో గోవా (Goa) వెళ్లినపుడు అక్కడ అనిల్ చౌదరి అనే వ్యక్తిని కలుసుకున్నాడు. ఆ సమయంలో వారిద్దరూ మొబైల్ నంబర్లు మార్చుకున్నారు. వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. 2019 మార్చిలో, ఆ వ్యాపారవేత్త ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేశారు. అక్కడకు అనిల్‌ను డిన్నర్ కోసం పిలిచాడు. అనిల్ తనతోపాటు సప్నా, మోనికా అనే మహిళలను తీసుకెళ్లాడు. నలుగురూ కలిసి డిన్నర్ చేసిన తర్వాత తమకు చిన్న పని ఉందని చెప్పి అనిల్, సప్నా బయటకు వెళ్లిపోయారు. ఆ సమయంలో మోనిక హోటల్ వాష్ రూమ్‌లోకి వెళ్లిపోయి చాలా సేపటి వరకు బయటకు రాలేదు.

Mother Love: ఇది కదా అమ్మ ప్రేమంటే.. కూతురిని డిగ్రీ చదివించేందుకు ఈ తల్లి ఎన్ని కష్టాలు పడుతోందో తెలిస్తే..!

కొద్దిసేపటి తర్వాత ఎవరో హోటల్ రూమ్ డోర్ బెల్ మోగించారు. ఆ సమయంలో వాష్ రూమ్‌లో నుంచి బయటకు వచ్చిన మోనిక పూర్తి నగ్నంగా మారిపోయి కేవలం బెడ్ షీట్ కప్పుకుని ఉంది. తనను కాపాడాలని వేడుకుండా గట్టిగా కేకలు వేసింది. ఆమె కప్పుకున్న బెడ్‌షీట్ మీద రక్తపు మరకలు ఉన్నాయి. ఆ వ్యాపారవేత్త తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అందుకే బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు ఏర్పడ్డాయని నమ్మించింది. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసింది. బిత్తరపోయిన వ్యాపారవేత్త తన స్నేహితుడు అనిల్‌కు అసలు విషయం చెప్పేందుకు ప్రయత్నించాడు (Cheating).

అనిల్ నమ్మకపోగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆ వ్యాపారవేత్తను బెదిరించాడు. తమకు రూ.10 కోట్లు ఇస్తేనే రాజీకి వస్తామని అనిల్ చెప్పాడు. అలా రెండేళ్ల వ్యవధిలో మోనికాకు ఆ వ్యాపారవేత్త 3.26 కోట్లు రూపాయలు చెల్లించాడు. అయినా వారు వదలకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనిల్‌ను, సప్నాను అరెస్ట్ చేసి నిజాలు వెలికితీశారు. పరారీలో ఉన్న మోనిక గురించి గాలిస్తున్నారు.

Updated Date - 2023-07-18T15:56:24+05:30 IST