ప్రియుడితో వెళ్లిపోవడానికి బాలిక అద్భుతమైన స్కెచ్.. అసలు విషయం తెలుసుకుని షాకైన తల్లిదండ్రులు.. చివరకు..

ABN , First Publish Date - 2023-02-28T16:27:05+05:30 IST

అంబాలాకు చెందిన బాలిక ఏడాది కాలంగా తన కాలనీకే చెందిన రవి కుమార్ అనే యువకుడితో లవ్ ఎఫైర్ నడుపుతోంది. కాలేజీకి వెళ్లకుండా అతడితో కలిసి తిరుగుతోంది. ఈ విషయాలేవీ తల్లిదండ్రులకు తెలియవు.

ప్రియుడితో వెళ్లిపోవడానికి బాలిక అద్భుతమైన స్కెచ్.. అసలు విషయం తెలుసుకుని షాకైన తల్లిదండ్రులు.. చివరకు..

ఆ బాలిక వయసు 17 సంవత్సరాలు.. 11వ తరగతి చదువుతోంది.. కొన్ని రోజులుగా ఆమె ఓ యువకుడితో ప్రేమయాణం (Love Affair) సాగిస్తోంది.. ఆ కుర్రాడిని విడిచి ఉండలేకపోతోంది.. అతడితో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటోంది.. అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోరని తెలిసి అద్భుతమైన స్కెచ్ వేసింది.. అసలు విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు షాకయ్యారు.. తమ కూతురి కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు.. హర్యానాలోని (Haryana) అంబాలాలో ఈ ఘటన జరిగింది.

అంబాలాకు చెందిన బాలిక ఏడాది కాలంగా తన కాలనీకే చెందిన రవి కుమార్ అనే యువకుడితో లవ్ ఎఫైర్ నడుపుతోంది. కాలేజీకి వెళ్లకుండా అతడితో కలిసి తిరుగుతోంది. ఈ విషయాలేవీ తల్లిదండ్రులకు తెలియవు. తన ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆ బాలిక అందుకోసం ఓ సాకును వెతికింది. గురుద్వారాలోని అమ్మమ్మను చూడడానికి వెళతానని, ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తండ్రి ఆ బాలికను బస్ ఎక్కించాడు. అయితే ఆ బాలిక తమ దగ్గరకు రాలేదని అమ్మమ్మ చెప్పడంతో ఆ తండ్రి షాకయ్యాడు (Minor girl eloped with lover).

Shocking: పెళ్లి వేడుకలో రభస.. పెళ్లి బృందంపై హోటల్ సిబ్బంది దాడి.. ఇంత దారుణమా అంటూ నెటిజన్లు షాక్!

రెండ్రోజులు గడిచినా కూతురి గురించి ఎలాంటి సమాచారమూ తెలియకపోవడంతో కాలేజీకి వెళ్లి అడిగాడు. అక్కడ అతడికి షాకింగ్ విషయం తెలిసింది. తన కూతురు నెలకు ఐదు రోజులు మాత్రమే కాలేజీకి వెళ్లేదని తెలిసింది. ఆమె స్నేహితుల ద్వారా రవికుమార్ గురించి తెలిసింది. తన కూతురు అతడితో వెళ్లిపోయిందని తెలుసుకున్న తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక మైనర్ కావడంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని ఆ బాలిక కోసం గాలిస్తున్నారు (Crime News).

Updated Date - 2023-02-28T16:27:05+05:30 IST