Aadhaar: ఆధార్‌పై యూఐడీఏఐ కీలక ప్రకటన...
ABN , First Publish Date - 2023-06-16T17:30:51+05:30 IST
గడువు ముగిసిపోవడంతో ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేయించుకోలేకపోయామే అనుకునేవారికి గుడ్‌న్యూస్. ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు తేదీని యూఐడీఏఐ (Unique Identification Authority of India) పొడగించింది. జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు పెంచింది. దీంతో మూడు నెలలపాటు గడువిచ్చినట్టయ్యింది.
న్యూఢిల్లీ: గడువు ముగిసిపోవడంతో ఉచితంగా ఆధార్ అప్‌డేట్ (Aadhaar Update) చేయించుకోలేకపోయామే అనుకునేవారికి గుడ్‌న్యూస్. ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు తేదీని యూఐడీఏఐ (Unique Identification Authority of India) పొడగించింది. జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు పెంచింది. దీంతో మూడు నెలలపాటు గడువిచ్చినట్టయ్యింది. కాగా గుర్తింపు వివరాలు, అడ్రస్ డాక్యుమెంట్స్ వంటి వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు 15 మార్చి 2023 నుంచి జూన్ 14, 2023 వరకు యుఐడీఏఐ అవకాశమిచ్చింది.
యూఐడీఏ వెబ్‌సైట్ డేటా ప్రకారం.. ‘‘ దయచేసి.. కచ్చితమైన సమాచారంతో ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను కొనసాగించండి. అప్‌డేట్ కోసం గుర్తింపు ప్రూఫ్, అడ్రస్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి’’ అని సూచించింది. కాగా https://myaadhaar.uidai.gov.in ద్వారా చేసుకోవచ్చు. ఇక సర్వీసు సెంటర్ల వద్ద అయితే రూ.25 ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది.