Shocking Video: వామ్మో.. గాలికి ఎంత బలముందో చూశారా? రన్ వేపై విమానాన్ని ఎలా తిప్పేసిందో చూడండి..
ABN , Publish Date - Dec 19 , 2023 | 11:34 AM
ప్రకృతి విలయతాండవం ముందు ఎంతటి అద్భుత నిర్మాణాలైనా, ఎలాంటి బలమైన ఆవిష్కరణలైనా తల వంచాల్సిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ఆ విషయాన్ని తాజాగా మరోసారి రుజువు చేసింది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో వీచిన బలమైన గాలులు విమానాలను సైతం కదిలించేశాయి.
ప్రకృతి (Nature) విలయతాండవం ముందు ఎంతటి అద్భుత నిర్మాణాలైనా, ఎలాంటి బలమైన ఆవిష్కరణలైనా తల వంచాల్సిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) ఆ విషయాన్ని తాజాగా మరోసారి రుజువు చేసింది. అర్జెంటీనా (Argentina) రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో వీచిన బలమైన గాలులు (Heavy Winds) విమానాలను సైతం కదిలించేశాయి. తూర్పు అర్జెంటీనాను భారీ తుఫాను (Storm)హడలెత్తిస్తోంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంగా బలమైన గాలులు వేస్తున్నాయి.
ఆ గాలుల ధాటికి తూర్పు అర్జెంటీనాలో చాలా విధ్వంసం జరిగింది. బ్యూనస్ ఎయిర్స్ (Buenos Aires) సమీపంలోని ఏరోపార్క్ జార్జ్ న్యూబెరీ ఎయిర్‌పోర్ట్‌ను కూడా ఆదివారం బలమైన గాలులు చుట్టుముట్టాయి. దీంతో ఆ విమానాశ్రయంలోని రన్ వేపై పార్క్ చేసి ఉన్న బోయింగ్ విమానం (Aeroplane) కూడా కదిలిపోయింది. బోర్డింగ్ కోసం ఏర్పాటు చేసిన మెట్లను తోసుకుంటు వెళ్లి లగేజ్ క్యారియర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం 14 మంది గాయపడినట్టు తెలుస్తోంది.
Viral Video: ఇది కశ్మీర్ కాదు.. మంచు అందాలతో మెరిసిపోతున్న ఈ ఏఐ నగరం ఏదో గుర్తుపట్టగలరా?
@Rainmaker1973 అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 9.4 లక్షల మందికి పైగా వీక్షించారు. ``ఈ తుఫాను ధాటికి బ్యూనస్ ఎయిర్స్ నాశనం అవుతోంది``, ``అసాధారణ వాతావరణ పరిస్థితులకు ఎవరైనా తలవంచాల్సిందే``, ``ప్రకృతి వైల్డ్‌గా మారితే ఎవరూ ఏమీ చేయలేరు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.