Viral Video: అడవికి రారాజు సింహం కాదండోయ్.. పులులు కూడా కాదు.. ఈ వీడియో చూస్తే అసలు కింగ్ ఎవరో తేలిపోవడం పక్కా..!

ABN , First Publish Date - 2023-09-08T16:11:23+05:30 IST

అడవి చాలా అద్భుతమైనది. అడవి జంతువులు ఆహారం కోసం తప్ప మరో జంతువుపై దాడి చేయవు. అనవసరంగా మరో జంతువు జోలికి వెళ్లవు. అడవికి రాజు అయిన సింహం కూడా వేరే జంతువుతో ఘర్షణ పడదు. అవసరమైతే వెనక్కి తగ్గి దూరంగా వెళ్లిపోతుంది.

Viral Video: అడవికి రారాజు సింహం కాదండోయ్.. పులులు కూడా కాదు.. ఈ వీడియో చూస్తే అసలు కింగ్ ఎవరో తేలిపోవడం పక్కా..!

అడవి (Forest) చాలా అద్భుతమైనది. అడవి జంతువులు (Wild Animals) ఆహారం కోసం తప్ప మరో జంతువుపై దాడి చేయవు. అనవసరంగా మరో జంతువు జోలికి వెళ్లవు. అడవికి రాజు అయిన సింహం (Lion) కూడా వేరే జంతువుతో ఘర్షణ పడదు. అవసరమైతే వెనక్కి తగ్గి దూరంగా వెళ్లిపోతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Lion Videos) చూస్తే సింహాల ప్రవర్తన ఆశ్చర్యం అనిపించకమానదు. IFS అధికారి సుశాంత నందా ఈ వీడియో (Viral Video)ను ట్విటర్‌లో షేర్ చేశారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో రెండు సింహాలు రోడ్డు మధ్యలో పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నాయి. అంతలో అదే మార్గం గుండా రెండు ఖడ్గమృగాలు (Rhinos) నడుచుకుంటూ వస్తున్నాయి. వాటిని చూసిన సింహాలు అలర్ట్ అయ్యాయి. వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటనను పర్యాటకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ``సింహాలు, పులులు అడవికి రాజులు కాదు. అంతా పరిస్థితులను బట్టి ఉంటుంది`` అని సుశాంత నందా కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ఈ పిల్లాడెవరో కానీ.. భవిష్యత్తులో బడా ఇంజనీర్ అవడం ఖాయం.. పొలాల్లో దొరికే కర్రలతోనే ఏం చేశాడో చూడండి..!

కొన్ని రోజుల క్రితం రమేష్ పాండే అనే IFS అధికారి ఓ వీడియో పోస్ట్ చేశారు. ఏనుగు (Elephant) నడుచుకుంటూ వస్తుంటే అదే మార్గంలో విశ్రాంతి తీసుకుంటున్న పులి (Tiger) వెంటనే లేచి పొదల్లోకి వెళ్లిపోయింది. ఆ వీడియోకు రిప్లై ఇస్తూ సుశాంత నందా ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 25 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

Updated Date - 2023-09-08T16:11:23+05:30 IST