MS Dhoni: విమానంలో క్యాండీక్రష్ ఆడుతున్న ధోనీకి చాక్లెట్లు ఆఫర్ చేసిన ఎయిర్ హోస్టెస్.. ధోనీ రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-06-25T19:41:56+05:30 IST

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడు మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్‌లో చెన్నై తరఫున బరిలోకి దిగిన ధోనీ ఎక్కడ మ్యాచ్ ఆడినా అభిమానులు అతడికి బ్రహ్మరథం పట్టారు.

MS Dhoni: విమానంలో క్యాండీక్రష్ ఆడుతున్న ధోనీకి చాక్లెట్లు ఆఫర్ చేసిన ఎయిర్ హోస్టెస్.. ధోనీ రియాక్షన్ ఏంటంటే..

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్‌ (IPL 2023)లో చెన్నై తరఫున బరిలోకి దిగిన ధోనీ ఎక్కడ మ్యాచ్ ఆడినా అభిమానులు అతడికి బ్రహ్మరథం పట్టారు. ధోనీ కోసం స్టేడియాలకు పోటెత్తారు. ఈ సీజన్‌లో చెన్నై టీమ్‌ (CSK)ను నడిపించిన ధోనీ ఐదోసారి టైటిల్ సాధించాడు. ప్రస్తుతం క్రికెట్‌కు కాస్త విరామం ప్రకటించిన ధోనీ ఓ విమానం (Flight)లో కనిపించాడు.

ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఎయిర్ హోస్టెస్ (Air hostess) చాక్లెట్లతో ఉన్న ట్రే పట్టుకుని ధోనీ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో ధోనీ క్యాండీ క్రష్ (Candy Crush) ఆడుతున్నాడు. ఆ ట్రేను చూసిన ధోనీ చిరునవ్వు నవ్వి ఒక్క చాక్లెట్ (Chocolate) మాత్రం తీసుకుని చాలు అన్నట్టు సైగ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

Viral: భార్య కోసం ఎన్నో త్యాగాలు చేశాడు.. కష్టపడి ఆమెను ఉన్నతోద్యోగిని చేశాడు.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..

ఈ వీడియోను కొద్ది గంటల్లోనే 1.3 లక్షల మంది వీక్షించారు. ఆ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ``ధోనీ దెబ్బకు క్యాండీక్రష్ డౌన్‌లోడ్స్ విపరీతంగా పెరుగుతాయి``, ``క్యాండిక్రష్‌లో ధోని ఏ లెవెల్‌లో ఉన్నాడో`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-25T20:07:08+05:30 IST