Viral Video: వార్నీ.. విమానాశ్రయంలో ఇలా కూడా జరుగుతుందా? లగేజ్ తనిఖీ చేస్తూ డబ్బు కొట్టేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది!

ABN , First Publish Date - 2023-09-17T11:05:43+05:30 IST

సాధారణంగా విమానాశ్రయాల గురించి అందరికీ గొప్ప అభిప్రాయం ఉంటుంది. అక్కడ చెకింగ్ చాలా పకడ్బంధీగా జరుగుతుందని, సిబ్బంది అంతా పక్కాగా ఉంటుందని అనుకుంటారు. ముఖ్యంగా అమెరికా లాంటి దేశంలో ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ మరింత క్రమశిక్షణతో ఉంటారని భావిస్తాం. అయితే..

Viral Video: వార్నీ.. విమానాశ్రయంలో ఇలా కూడా జరుగుతుందా? లగేజ్ తనిఖీ చేస్తూ డబ్బు కొట్టేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది!

సాధారణంగా విమానాశ్రయాల (Airports) గురించి అందరికీ గొప్ప అభిప్రాయం ఉంటుంది. అక్కడ చెకింగ్ చాలా పకడ్బంధీగా జరుగుతుందని, సిబ్బంది అంతా పక్కాగా ఉంటుందని అనుకుంటారు. ముఖ్యంగా అమెరికా (America) లాంటి దేశంలో ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ (Airport Staff) మరింత క్రమశిక్షణతో ఉంటారని భావిస్తాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే షాక్ అవకతప్పదు. ఎందుకంటే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో విమానాశ్రయ సిబ్బంది చేతివాటం (Theft) ప్రదర్శించనిట్టు స్పష్టంగా కనిపిస్తోంది (Airport staff stealing money).

అమెరికాలోని మియామీ విమానాశ్రయంలో (Miami airport) జూన్ 29వ తేదీన ఈ వీడియో రికార్డు అయింది. మియామీ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు తమ లగేజీని సెక్యూరిటీ స్కాన్ కోసం మెషిన్ పై పెట్టారు. అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగులు జోసూ గోంజాలెజ్, లాబరియస్ విలియమ్స్ వాటిని స్కానింగ్ మెషిన్‌లోకి పంపిస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరూ ప్రయాణికులు బ్యాగుల్లో నుంచి 600 డాలర్లను కొట్టేశారు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను పరిశీలించగా ఈ దొంగతనం బయటపడింది.

Viral Video: అయ్యో.. 19 ఏళ్ల కుర్రాడికి ఇలాంటి పరిస్థితా?.. ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా గుండెపోటు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

వెంటనే వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో వారిద్దరూ నిజాన్ని అంగీకరించారు. తాము చాలా రోజులుగా అలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నామని స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి రోజుకు సగటున వెయ్యి డాలర్ల వరకు కాజేస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2023-09-17T11:05:43+05:30 IST