Viral Video: ఇదేం టెక్నిక్ గురూ..! ఐస్‌క్రీమ్‌ను ఇలా కూడా తయారు చేయవచ్చా.. వైరల్ అవుతున్న వీడియో!
ABN , First Publish Date - 2023-07-05T18:35:53+05:30 IST
ఐస్‌క్రీమ్‌ను ఇష్టపడని వారు ఉండరు. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వారి వరకు అందరికీ ఐస్‌క్రీమ్ అంటే నోరూరిపోతుంది. ఐస్‌క్రీమ్ షాప్ కనిపిస్తే అటు వైపు వెళ్లిపోతుంటారు. అయితే కొంతమంది మాత్రం ఇంటి దగ్గరే ఐస్‌క్రీమ్ తయారు చేయడానికి ప్రయత్నిస్తారు.
ఐస్‌క్రీమ్ (Ice Cream)ను ఇష్టపడని వారు ఉండరు. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వారి వరకు అందరికీ ఐస్‌క్రీమ్ అంటే నోరూరిపోతుంది. ఐస్‌క్రీమ్ షాప్ కనిపిస్తే అటు వైపు వెళ్లిపోతుంటారు. అయితే కొంతమంది మాత్రం ఇంటి దగ్గరే ఐస్‌క్రీమ్ తయారు చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇంటి దగ్గర ఐస్‌క్రీమ్ తయారు చేయడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. గంటల కొద్దీ ఫ్రిజ్‌లో ఉంచితేనే గాని ఐస్‌క్రీమ్ తయారు కాదు. అందుకే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఓ ట్రిక్ కనిపెట్టాడు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు (Amazing trick of making Ice Cream).
@pareekhjain అనే ట్విటర్ యూజర్ ఈ వీడియో (Jugaad Video)ను షేర్ చేశారు. ``అవుట్ డోర్లో ఐస్‌క్రీమ్‌ను తయారు చేసే వింత మార్గం`` అని కామెంట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి కారు టైరుకు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్మును గట్టిగా బిగించాడు. ఆ తర్వాత ఓ స్టీల్ బాక్స్‌లో పాలు, గుడ్డు, ఓరియో బిస్కెట్లు, పంచదార వేసి దానికి మూత బిగించి టైర్‌కు కట్టిన ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచాడు. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ డ్రమ్ములో భారీగా ఐస్, ఐస్ క్రీమ్ సాల్ట్ వేసి మూత బిగించాడు. ఆ తర్వాత కారును స్టార్ట్ చేసి కాసేపు అటూ ఇటూ తిరిగాడు.
Slap Kabaddi: ఇదెక్కడి ఆట.. గేమ్ పేరుతో ఒకర్నొకరు కొట్టుకుంటున్న పాకిస్థానీయులు.. వీడియో వైరల్!
కారు టైరుకు కట్టిన ఆ డ్రమ్ము కూడా రొటేట్ అయింది. కొద్ది సేపటి తర్వాత ఆ ప్లాస్టిక్ డ్రమ్ము ఓపెన్ చేసి చూస్తే అందులో వేసిన ఐస్ లేదు. స్టిల్ కంటైనర్‌లో మాత్రం ఐస్‌క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి చాలా మంది షాకవుతున్నారు. దీని వెనకాల ఉన్న ట్రిక్ (Trick) ఏంటో చెప్పాలని చాలా మంది అడుగుతున్నారు.