Viral: 8 నెలల పాప.. పొట్ట ఇలా ఉబ్బుతోందేంటని ఆస్పత్రికి తీసుకెళ్తే.. టెస్టులు చేసిన డాక్టర్లకే మైండ్‌బ్లాక్.. చివరకు..!
ABN , First Publish Date - 2023-07-29T20:01:50+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయోగరాజ్‌లో ఓ విచిత్రమైన మెడికల్ కేసు వెలుగులోకి వచ్చింది. ఎనిమిది నెలల క్రితం జన్మించిన పాప కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆ పాప కడుపు క్రమంగా ఉబ్బుతున్నట్టు గ్రహించిన కుటుంబ సభ్యులు వెంటనే చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆ పాపకు సీటీ స్కాన్ చేసిన డాక్టర్లు షాకయ్యారు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని ప్రయోగరాజ్ (Prayagraj)లో ఓ విచిత్రమైన మెడికల్ కేసు వెలుగులోకి వచ్చింది. ఎనిమిది నెలల క్రితం జన్మించిన పాప కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆ పాప కడుపు క్రమంగా ఉబ్బుతున్నట్టు గ్రహించిన కుటుంబ సభ్యులు వెంటనే చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆ పాపకు సీటీ స్కాన్ (CT Scan) చేసిన డాక్టర్లు షాకయ్యారు. ఎందుకంటే ఆ ఎనిమిది నెలల చిన్నారి గర్భంలో మరో ఎనిమిది నెలల పిండం (eight-months-old fetus in 8-months-old child) పెరుగుతోంది. షాకైన డాక్టర్లు అతి కష్టమైన ఆపరేషన్ చేసి ఆ పిండాన్ని బయటకు తీశారు.
ప్రతాప్‌గఢ్‌కు చెందిన ఓ వ్యక్తి ఎనిమిది నెలల తన కూతురిని గత సోమవారం సరోజినీ నాయుడు బాల చికిత్సాలయ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. బిడ్డ తల్లి పుట్టగానే చనిపోయిందని, అయితే నవజాత శిశువు మాత్రం సురక్షితంగా ఉందని చెప్పాడు. క్రమంగా ఆ చిన్నారి కడుపు ఉబ్బుతోందని గుర్తించి హాస్పిటల్‌కు తీసుకువచ్చినట్టు చెప్పాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు గుర్తించిన డాక్టర్ వెంటనే ఆ పాపకు సీటీ స్కాన్ చేశారు. చిన్నారి కడుపులో బిడ్డ ఉన్నట్టు స్కానింగ్‌లో తేలింది. వైద్యుల బృందం శుక్రవారం నాలుగు గంటలపాటు సంక్లిష్టమైన ఆపరేషన్ చేసి చిన్నారి కడుపులోంచి పిండాన్ని బయటకు తీశారు. చిన్నారిని కాపాడారు (Viral News).
August Month New Rules: ఆగస్టులో 3 కొత్త రూల్స్.. ఐసీఐసీఐ అకౌంట్ ఉన్నవాళ్లు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే..!
ఇటువంటి సందర్భం చాలా అరుదుగా కనిపిస్తుందని డాక్టర్ కుమార్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు 200 ఉండవచ్చని, తన వృత్తి జీవితంలో ఇలాంటి ఆపరేషన్ ఇదే మొదటిదని తెలిపారు. ``ఈ వ్యాధిని సాధారణంగా ``పిండంలో పిండం`` (Fetus in Fetus) అని అంటారు. గర్భిణీ స్త్రీ కడుపులోని రెండు అండాలు ఏర్పడినపుడు కవలలు పుడతారు. చాలా అరుదుగా మాత్రమే ఇలా ఒక పిండం లోపల మరో పిండం అభివృద్ధి చెందుతుంద``ని డాక్టర్ తెలిపారు.