Anand Mahindra: నాకిన్నాళ్ళూ ఈ విషయం తెలియదంటూ పేక ముక్క పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఇందులో రహస్యమేంటంటే..
ABN , First Publish Date - 2023-08-13T16:23:39+05:30 IST
పేకాట వ్యసనంగా కలిగినవారికి పేక ముక్కల(playing cards) గురించి ప్రతి సమాచారం తెలిసి ఉంటుంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియనట్టే ఉంది.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నెన్నో ఆసక్తికర విషయాలను, కొత్త ట్యాలెంట్ ను పరిచడం చేస్తుంటారీయన. తాజాగా ఈయన ఓ పేక ముక్క ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'నాకిన్నాళ్ళూ ఈ విషయం తెలియదు, దయచేసి ఈ విషయం తెలియని వాడిని నేనొక్కడినే అని చెప్పకండి' అంటూ కాస్త విచారంగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'పేకాట వ్యసనంగా ఉన్నవాళ్ళు కూడా ఈ విషయాన్ని గమనించి ఉండరు' అంటూ కామెంట్ చేశారు. అసలింతకీ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పేక ముక్కలో ఉన్న రహస్యం ఏంటి? అది మీకూ తెలుసా లేదా? పూర్తీగా తెలుసుకుంటే..
పేకాట వ్యసనంగా కలిగినవారికి పేక ముక్కల(playing cards) గురించి ప్రతి సమాచారం తెలిసి ఉంటుంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియనట్టే ఉంది. ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) 8సంఖ్య గల ఓ పేకముక్కను(8 number playing card) షేర్ చేశారు. డైమండ్స్ కలిగిన ఈ పేక ముక్కలో పైన ఒక మూల, కింద ఒక మూల 8 అంకె ఉంది. అయితే ఈ పేక ముక్కలో ఇంకొక 8అంకె ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చూడగానే ఎవరికీ ఈ మూడో 8 కనిపించదు. పేకముక్క మధ్యలో ఉన్న డైమండ్స్ ను జాగ్రత్తగా గమనిస్తే ఆ పేకముక్కల మధ్యలో 8 అంకె ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆప్టికల్ ఇల్యూషన్ గేమ్ లాంటిదని, ఇలాంటివి మెదడుకు పనిచెబితే తప్ప తొందరగా కనిపించవని అంటున్నారు. ఈ పేకముక్క రహస్యాన్ని Massimo అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. 'ఈ పేక ముక్క మధ్యలో ఉన్న 8ని గుర్తించినప్పుడు మీ వయసు ఎంత?' అని సరదాగా క్యాప్షన్ ను మెన్షన్ చేశారు.
Viral Video: ఈ పోలీసుకు ఇంత దూకుడెందుకు? ఇతనిపై ఫిర్యాదు చేస్తామంటూ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ట్వీట్.. అతను చేసిన పనేంటో మీరే చూడండి..
Massimo అనే అకౌంట్ నుండి షేర్ చేసిన ఈ పోస్ట్ ను anand mahindra తన ట్విట్టర్(Twitter) అకౌంట్ లో షేర్ చేసి 'దయచేసి ఇన్నాళ్ళు ఈ విషయం తెలియని వాడిని నేను ఒక్కడినే అని చెప్పకండి' అంటూ విచారమైన ఎమోజి జోడించి క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'మీరొక్కరే కాదు, మేము కూడా మీ లిస్ట్ లో ఉన్నాం, మాక్కూడా తెలియదు' అని ఒకరు కామెంట్ చేశారు. 'పేకముక్క మధ్యలో ఎనిమిది ఆకారాన్ని గుర్తించడానికి నేను దాన్ని చాలాసార్లు గమనించాల్సి వచ్చింది' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఎప్పుడూ పేక ముక్కలు వెంట ఉంచుకునేవారు కూడా ఈ విషయం గమనించి ఉండరు' అని మరికొందరు అంటున్నారు.