Share News

Anand Mahindra: పాక్‌పై భారత్ గెలుపు.. నాకు ఇలా డ్యాన్స్ చేయాలని ఉందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్..

ABN , First Publish Date - 2023-10-15T15:47:32+05:30 IST

ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తనకు నచ్చిన ఫన్నీ, ఆసక్తికర వీడియోలను ట్విటర్‌లో షేర్ చేస్తుంటారు. అలాగే భారత్ ఆడే క్రికెట్ మ్యాచ్‌లను కూడా ఫాలో అవుతుంటారు. టీమిండియా సాధించిన విజయాలను ఆయన కూడా సెలబ్రేట్ చేసుకుంటారు.

Anand Mahindra: పాక్‌పై భారత్ గెలుపు.. నాకు ఇలా డ్యాన్స్ చేయాలని ఉందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్..

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తనకు నచ్చిన ఫన్నీ, ఆసక్తికర వీడియోలను ట్విటర్‌లో షేర్ చేస్తుంటారు. అలాగే భారత్ ఆడే క్రికెట్ మ్యాచ్‌లను కూడా ఫాలో అవుతుంటారు. టీమిండియా (Team India) సాధించిన విజయాలను ఆయన కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. తాజాగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా (Ind vs Pak) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

భారత్ విజయం అనంతరం ఆనంద్.. టీమిండియాను అభినందిస్తూ ఆనంద్ ఓ ట్వీట్ చేశారు. ``మ్యాచ్‌లో భారత్ గెలిచాక నాకు ఇలా డ్యాన్స్ చేయాలని ఉంది`` అంటూ ఆనంద్ ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలోని ఓ వ్యక్తి అత్యంత వేగంగా డ్యాన్స్ (Dance) చేస్తున్నాడు. ఓ ఆఫ్రికన్ డ్యాన్సర్ మెరుపువేగంతో సంప్రదాయ నృత్యం చేస్తున్న వీడియోను ఆయన పంచుకున్నారు. ఆ వీడియో (Viral Video) చూసిన నెటిజన్లు కూడా అంతే సరదాగా స్పందిస్తున్నారు.

India vs Pakistan: భారత్, పాక్ మ్యాచ్.. ఏకంగా 70 బిర్యానీలు ఆర్డర్ చేసిన ఛండీగఢ్ కుటుంబం.. ఎందుకంటే..

ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 7.5 లక్షల మంది కంటే పైగా వీక్షించారు. ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``మీరు మ్యాచ్ చూశారా?``, ``సర్.. మీరు ఇలా డ్యాన్స్ చేయలేరేమో.. కానీ మీరు డ్యాన్స్ చేస్తూ చూడాలని ఉంది``, ``మ్యాచ్ పూర్తిగా వన్ సైడ్ అయిపోయింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-10-15T15:47:32+05:30 IST