Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో? టూత్ పేస్ట్ డబ్బాను ఇలా కూడా వాడొచ్చా? వైరల్ అవుతున్న వీడియో!
ABN , First Publish Date - 2023-09-09T12:45:29+05:30 IST
ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు ఫన్నీగా అనిపించిన, ఆసక్తికరంగా అనిపించిన వీడియోలను తన ఫాలోవర్లతో పంచుకుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ జుగాడ్ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు ఫన్నీగా అనిపించిన, ఆసక్తికరంగా అనిపించిన వీడియోలను తన ఫాలోవర్లతో పంచుకుంటారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ జుగాడ్ వీడియో (Jugaad Videos)చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఖాళీ అయిపోయిన టూత్ పేస్ట్ డబ్బాను (Empty tooth paste tube) ట్యాప్ (Tap)గా వాడుతున్న విధానం చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
పేస్ట్ అయిపోగానే ఖాళీ డబ్బాను చాలా మంది పక్కన పడేస్తారు. కానీ ఆ ఖాళీ డబ్బాను కూడా ఉపయోగించుకోవచ్చిన ఓ మహిళ నిరూపించింది. కుళాయి మూత పాడైనపుడు నీరు లీక్ అవుతుంటుంది. తన ఇంట్లో అలా పాడైన ఓ ట్యాప్‌ను చూసిన మహిళకు ఓ వినూత్న ఆలోచన వచ్చింది. ఖాళీ పేస్ట్ డబ్బా ఒకటి తీసుకుని దాని వెనుక వైపు కట్ చేసి కొళాయి పైపునకు బిగించింది. దానికి మూత పెట్టేస్తే నీరు ఆగిపోతోంది. నీరు కావాలనుకున్నప్పుడు ఆ మూత తీసేస్తే చాలు ఎంచక్కా నీరు బయటకు వస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది (Desi Jugaad Video).
Health Tips: నిద్రలో పళ్లు నూరే అలవాటు ఉందా? వెంటనే జాగ్రత్త పడండి.. లేకపోతే ఆ సమస్య రావడం ఖాయం!.
హర్ష్ గోయెంకా పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగానే వీక్షించారు. వెయ్యి మందికి పైగా లైక్ చేశారు. ఆ మహిళ తెలివితేటలపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ``నెక్ట్స్ లెవెల్ ఐడియా``, ``మేరా భారత్ మహాన్``, ``భారతీయ మహిళలు టూత్ పేస్ట్ ట్యూబ్ చాలా విధాలుగా వాడతారు``, ``తక్కువ ఖర్చు.. ఎక్కువ వాడకం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.