Adipurush: వందల కోట్ల రూపాయల ఆదిపురుష్ కంటే.. ఇదే బెస్ట్ అంటూ నెట్టింట కామెంట్స్.. ఈ వీడియోను చూస్తే..!

ABN , First Publish Date - 2023-09-25T17:06:09+05:30 IST

రామాయణానికి సంబంధించిన ప్రతి పాత్రకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. రాముడు, సీత, హనుమంతుడు.. ఇలా ప్రతి పాత్ర ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. రాముడితో పాటు ఆయన భక్తుడు హనుమంతుడు కూడా ఎంతో మందికి ఆరాధ్య దైవంగా నిలిచాడు.

Adipurush: వందల కోట్ల రూపాయల ఆదిపురుష్ కంటే.. ఇదే బెస్ట్ అంటూ నెట్టింట కామెంట్స్.. ఈ వీడియోను చూస్తే..!

రామాయణానికి (Ramayan) సంబంధించిన ప్రతి పాత్రకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. రాముడు (Lord SriRam), సీత, హనుమంతుడు (Hanuman).. ఇలా ప్రతి పాత్ర ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. రాముడితో పాటు ఆయన భక్తుడు హనుమంతుడు కూడా ఎంతో మందికి ఆరాధ్య దైవంగా నిలిచాడు. ఇప్పటికే రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు, రచనలు పుట్టుకొచ్చాయి. ఇటీవల ప్రభాస్ హీరోగా రూపొందిన ``ఆదిపురుష్`` (Adipurush) కూడా రాముడి కథే అని తెలిసిందే. తాజాగా ఓ కళాకారుడు హనుమంతుడి జీవితాన్ని డూడుల్స్‌తో అద్భుతంగా చిత్రీకరించాడు.

ps.rathour అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో పీఎస్ రాథోడ్ అనే డూడుల్ ఆర్టిస్ట్ హనుమంతుడి జీవితాన్ని 40 డూడుల్స్‌తో అద్భుతంగా వివరించాడు (Hanuman Chalisa in 40 doodles). హనుమంతుడు పుట్టడం దగ్గర్నుంచి, సూర్యుడి దగ్గరకు వెళ్లడం, రాముడిని కలుసుకోవడం, సీతమ్మను కలవడం, సంజీవినీ పర్వతాన్ని తీసుకురావడం మొదలైనవన్నింటినీ అద్భుతంగా చిత్రీకరించాడు. ఇది మొత్తం చిత్రీకరించడానికి ఆ ఆర్టిస్ట్‌కు వారం రోజులు పట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: ఈ కోతి కొత్తగా ఉద్యోగంలో చేరిందా ఏంటి..? కంప్యూటర్ ముందు కూర్చుని ఎంత సిన్సియర్‌గా పనిచేస్తోందో చూడండి..!

ఈ వీడియోను ఇప్పటివరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు. ఆ ఆర్టిస్ట్ అద్భుత ప్రతిభను నెటిజన్లు కొనియాడుతున్నారు. ``వందల కోట్ల ఆదిపురుష్ కంటే ఈ 30 సెకెండ్ల వీడియో అద్భుతంగా ఉంది``, ``అతడి ప్రతిభ అమోఘం``, ``అతడికి ఎల్లప్పుడూ హనుమంతుడి ఆశీస్సులు ఉండాలి``, ``జై హనుమాన్``, ``జై శ్రీరామ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-09-25T19:51:21+05:30 IST