Interesting video: వివిధ దేశాల విమానాశ్రయాల్లో లగేజ్‌ను ఎలా తీస్తున్నారో చూడండి.. హర్ష్ గోయెంకా ఆసక్తికర విశ్లేషణ!
ABN , First Publish Date - 2023-08-21T14:09:29+05:30 IST
ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన ఆసక్తికర వీడియోలను తనదైన విశ్లేషణలతో ట్విటర్‌లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో, దానికి ఆయన చేసిన విశ్లేషణ చాలా మందిని ఆకట్టుకుంటోంది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన ఆసక్తికర వీడియోలను తనదైన విశ్లేషణలతో ట్విటర్‌లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో, దానికి ఆయన చేసిన విశ్లేషణ చాలా మందిని ఆకట్టుకుంటోంది. వివిధ దేశాలలోని విమానాశ్రయాలలో (Airports) లగేజీని అన్‌లోడ్ చేసే విధానాన్ని ఆ దేశ ప్రజల స్వభావంతో ముడిపెట్టి ఆయన ఒక పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వివిధ దేశాల ఎయిర్‌పోర్ట్‌లలో ఉద్యోగులు ప్రయాణికుల లగేజీ (Luggage)ని విమానాల నుంచి అన్‌లోడ్ చేస్తున్నారు.
ముందుగా జపాన్ విమానాశ్రయం (Japan Airport)లోని ఉద్యోగుల పనితీరును చూపించారు. అక్కడి సిబ్బంది ప్రయాణికుల లగేజీని చాలా జాగ్రత్తగా దించి మరో వాహనంలోకి ఎక్కిస్తున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా విమానశ్రయంలో సిబ్బంది కాస్తంత హడావిడిగా కనిపించారు. లగేజీని అన్‌లోడ్ చేసే సమయంలో కాస్త దురుసుగా ప్రవర్తించారు. ఇక, అమెరికా సిబ్బంది అయితే ప్రయాణికుల లగేజీని విసిరి పారేస్తున్నారు. లగేజీ పాడైపోతుందనే స్పృహ లేకుండా విమానం నుంచి దించి వేరే వాహనంలోకి విసిరేస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని బ్యాగులు వాహనంలో కాకుండా రోడ్డుపై పడిపోయాయి (Handling luggage at airports).
Viral Video: మీ పిల్లలు జెల్లీలు తింటుంటారా? అయితే జాగ్రత్త.. అవి ఎలా తయారవుతాయో తెలిస్తే..
``నా అభిప్రాయం ప్రకారం.. ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల లగేజీతో వ్యవహరించే విధానానికి, ఎదుటి మనషులతో ఎలా మెలుగుతారు అనే దానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది`` అని హర్ష్ కామెంట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 42 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఎదుట వ్యక్తితో మన ప్రవర్తన మన క్యారెక్టర్‌ను ప్రతిబింబిస్తుంది. ఎదుటి వ్యక్తులను గౌరవించే సాంప్రదాయం ఓ సమాజం మొత్తానికి అలవాటైతే అది సంస్కృతి అవుతుంది. అందరూ ఈ అలవాటు నేర్చుకోవాల``ని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.