Bahubali: వీధుల్లో ‘బాహుబలి’ వాకింగ్‌

ABN , First Publish Date - 2023-05-20T10:28:29+05:30 IST

మేట్టుపాళయం సమీపంలోని సమయపురంలో మూడు ఏనుగులు మకాం వేశాయి. ఈ గ్రామం సమీపం లోని అడవుల నుంచి 10 రోజులుగా మూడు ఏనుగులు

Bahubali: వీధుల్లో ‘బాహుబలి’ వాకింగ్‌

పెరంబూర్‌(చెన్నై): కోయంబత్తూర్‌ జిల్లా మేట్టుపాళయం సమీపంలోని సమయపురంలో మూడు ఏనుగులు మకాం వేశాయి. ఈ గ్రామం సమీపం లోని అడవుల నుంచి 10 రోజులుగా మూడు ఏనుగులు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహారం కోసం గ్రామానికి వస్తున్నాయి. సాయంత్రం వేళల్లో పొలాల్లో మేతకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చే ఆవులతో పాటు ‘బాహుబలి’ పిలువబడుతున్న ఏనుగు(Elephant) కూడా వస్తోంది. దీంతో, ఉదయం, సాయంత్రం సమయాల్లో గ్రామాల్లో వాకింగ్‌కు వస్తున్న ఏనుగుల నుంచి ప్రమాదం జరుగక ముందే అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Updated Date - 2023-05-20T10:28:29+05:30 IST