Balayya vs YS Jagan: ఆంధ్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన వీరసింహా రెడ్డి

ABN , First Publish Date - 2023-01-12T17:00:24+05:30 IST

బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన 'వీరసింహా రెడ్డి' (Veerasimha Reddy) విడుదల అయింది. సినిమా మీద స్పందన మిశ్రమంగా వుంది. కొందరు హింస మరీ ఎక్కువయిందని, మరికొందరు బాలకృష్ణ సినిమాలు అంతే అని ఇలా ఎవరికి వారు అనుకుంటున్నారు.

Balayya vs YS Jagan: ఆంధ్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన వీరసింహా రెడ్డి

బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన 'వీరసింహా రెడ్డి' (Veerasimha Reddy) విడుదల అయింది. సినిమా మీద స్పందన మిశ్రమంగా వుంది. కొందరు హింస మరీ ఎక్కువయిందని, మరికొందరు బాలకృష్ణ సినిమాలు అంతే అని ఇలా ఎవరికి వారు అనుకుంటున్నారు. అయితే సినిమా ఎలా వున్నా, బాలకృష్ణ ఈ సినిమా నుండి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని (Andhra Pradesh Government), వై ఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ని టార్గెట్ చేసాడు అని మాత్రం అంటున్నారు. ఎందుకంటే ఇందులో కొన్ని డైలాగ్స్, సన్నివేశాలు కేవలం వై ఎస్ జగన్ (Y S Jagan) ప్రభుత్వం ఈమధ్య చేసిన కొన్ని నిర్ణయాలకు ఈ డైలాగ్స్ వర్తిస్తాయి అని అంటున్నారు. (Some of the dialogues target YS Jagan directly)

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వలన చాలా పరిశ్రమలు బయటకి వెళ్లిపోతున్నాయి అని ఒక చర్చ నడిచింది కదా. దాని మీద ఇందులో ఒక పాత్రధారి చేత బాలకృష్ణ కి చెప్పించారు. (Major industries are left Andhra Pradesh due to the government's policies) "గత 30 ఏళ్ల నుండి ఇక్కర పరిశ్రమ పెట్టి, ఉద్యోగాలు ఇచ్చి అందరికి ఉపాధి కల్పించిన నాకు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. కరెంట్ కట్ చేస్తోంది, నీళ్లు ఇవ్వటం లేదు, పరిశ్రమలో ప్రభుత్వ పెద్దలు వాటాలు కూడా అడుగుతున్నారు. నేను ఇంకా మూసేసి బయటకి వెళ్ళిపోవాలి," అని బాలకృష్ణ తో ఆ పాత్రధారి మొరపెట్టుకుంటాడు.

nbk-political.jpg

అలాగే ఇంకో దగ్గర ఎన్ట్.టి.ఆర్. విశ్వవిద్యాలయం పేరు వై.ఎస్.ఆర్. విశ్వవిద్యాలయంగా వై.ఎస్. జగన్ ప్రభుత్వం మార్చేసింది, దాని మీద కూడా ఒక డైలాగ్ చెప్తాడు బాలయ్య. (NTR University name changed to YSR University by YS Jagan Government) "సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ, ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు", అని అంటాడు బాలకృష్ణ. దీని మీద ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇది కచ్చితంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాసిన డైలాగ్ అని తెలుస్తోంది.

బాలకృష్ణ రాయలసీమలో ప్రజల పక్షాన నిలుస్తూ పోరు సాగిస్తూ ఉంటాడు ఈ 'వీర సింహా రెడ్డి' సినిమాలో. ఆయనకు ఒకసారి హోమ్ మంత్రి నుంచి పిలుపు వస్తుంది, ఒకసారి వచ్చి కలవమని. అప్పుడు బాలయ్య పక్కన వున్న అతని అనుచరుడు, ''నువ్వు వెళ్ళడం ఏమిటి పెద్దయ్య" అని అంటాడు. అప్పుడు బాలకృష్ణ ''ప్రజలు ఎన్నుకున్న వెధవలు వాళ్ళు! గౌరవించడం మన ధర్మం, బాధ్యత'' అని చెప్తాడు. అంటే ఇది వై.ఎస్. జగన్ ను ఉద్దేశించి రాసింది అని కచ్చితంగా తెలుస్తోంది అని అంటున్నారు. (Telugu film industry people met YS Jagan to discuss about a few issues facing by the industry in Andhra Pradesh)

తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి, అలాగే ఆంధ్ర లో టికెట్ రేట్స్, ఇంకా ఇతర కారణాల కోసం జగన్ కలిశారు కొందరు సినిమా పరిశ్రమకి చెందిన వారు. అయితే అప్పట్లో వీళ్ళందరూ వెళ్లి జగన్ కాళ్ళు పట్టుకున్నారు అని విమర్శలు కూడా చేసారు. అందుకని ఈ సినిమాలో ఆ పై డైలాగ్ పెట్టారు అని అంటున్నారు. బుర్ర సాయి మాధవ్ (Burra Sai Madhav) మాటలు మాత్రం బాగా రాసాడు అని అందరూ కితాబునిస్తున్నారు.

Updated Date - 2023-01-12T17:06:55+05:30 IST