Ballary: సీనమ్మకు.. ‘భూమి-భాను’ అనే రెండు పిల్లలు.. అవి అటు ఇటు తిరుగుతుంటే...

ABN , First Publish Date - 2023-09-24T12:17:13+05:30 IST

చిత్రదుర్గ సమీపంలోని ఆడుమేల్వేశ్వర ప్రాంతంలో ఏర్పాటు చేసిన మృగాలయంలో ఎలుగుబంటి రెండు ఎలుగుబంటి కూనలకు

Ballary:  సీనమ్మకు.. ‘భూమి-భాను’ అనే రెండు పిల్లలు.. అవి అటు ఇటు తిరుగుతుంటే...

బళ్లారి(బెంగళూరు): చిత్రదుర్గ సమీపంలోని ఆడుమేల్వేశ్వర ప్రాంతంలో ఏర్పాటు చేసిన మృగాలయంలో ఎలుగుబంటి రెండు ఎలుగుబంటి కూనలకు జననం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు వాటికి భూమి, భానుగా నామకరణం చేశారు. తల్లి ఎలుగుబంటి తన చిన్న కూనలతో జూ పరిసరాల్లో తిరగడానికి అవకాశం కల్పించడంతో వాటిని చిత్రదుర్గ నగర ప్రజలు ఉత్సాహంతో తిలకిస్తున్నారు. సీనమ్మ అనే పెద్ద ఎలుగుబంటి గత ఏడాది డిసెంబరు 24వ తేదీన రెండు పిల్ల ఎలుగబంటకు జన్మనిచ్చింది. 9 నెలల పాటు వాటిని బయటకు ఎక్కడా వెళ్ళనీయకుండా, బయటకు కనిపించకుండా జాగ్రత్తగా పోషిస్తూ వచ్చినట్లు జూ అధికారులు తెలిపారు. వినాయక చవితిని పురస్కరించుకుని తల్లి, కూన ఎలుగుబంట్లను జూ ఆవరణంలో వదలడంతో, చిత్రదుర్గకు వచ్చే పర్యాటకు ఈ జూను తిలకిస్తూ జూలో సంచరిస్తున్న కూన ఎలుగుబంట్లను చూసి పులకిస్తున్నారు. హొసదుర్గ తాలూకా చిక్కిన సీనమ్మ(అటవీశాఖ అధికారులు పెట్టిన పేరు) మొదటిసారిగా రెండు పిల్లలకు జన్మనిచ్చింది. సామాన్యంగా ఎలుగుబంట్లు గుబురుగా ఉన్న పొదలు, కొండరాళ్ళ మధ్యన నివాసానికి అలవాటు పడిన ఎలుగుబంటుకు మృగాలయ వాతావరణానికి అలవాటు కావాలనే ఉద్దేశ్యంతో జూ ఆవరణంలో తిరడానికి తల్లి, పిల్ల ఎలుగుబంట్లను వదిలినట్లు జూ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-09-24T12:17:13+05:30 IST