Kashi: బనారస్ పాన్, లాంగ్డా మామిడి పండ్లకు జీఐ ట్యాగ్
ABN , First Publish Date - 2023-04-04T12:12:34+05:30 IST
వారణాసికి చెందిన బనారసి పాన్, లాంగ్డా మామిడికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) ట్యాగ్‌లు లభించాయి....
వరణాసి(ఉత్తరప్రదేశ్): వారణాసికి చెందిన బనారసి పాన్, లాంగ్డా మామిడికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) ట్యాగ్‌లు లభించాయి.(Banarasi Paan, Langda Mango) చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ కాశీ ప్రాంతానికి చెందిన పాన్, మామిడికే(Four Products From Kashi) కాకుండా మరో రెండు ఉత్పత్తులకు ట్యాగ్‌లను అందించింది,
రామ్‌నగర్ భంటా (వంకాయ), చందౌసి యొక్క ఆడమ్చిని చావల్ (బియ్యం) జీఐ క్లబ్ లోకి ప్రవేశించాయి. ఈ జీఐ ట్యాగ్ ఈ ఉత్పత్తుల గుర్తింపు, వాణిజ్యంతో కూడిన ముఖ్యమైన విజయం.ఈ నాలుగు ఉత్పత్తులు వ్యవసాయం, ఉద్యానవనాలకు సంబంధించిన పంటలకు జీఐ ట్యాగ్ ఇప్పించడంలో నాబార్డు కీలక పాత్ర పోషించింది.
ఇది కూడా చదవండి : Madhya Pradesh:రూ.49 పెట్టుబడి పెట్టి రాత్రికి రాత్రే రూ.1.5కోట్లు గెల్చుకున్నాడు...ఎలా అంటే...
రూ.25,500 కోట్ల వార్షిక వ్యాపారం చేసిన నాలుగు ఉత్పత్తులకు ఎట్టకేలకు జీఐ గుర్తింపు లభించింది. 20 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్‌ల కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసిందని, 11 ఉత్పత్తులు జిఐ క్లబ్‌లో చేరాయని అధికారులు చెప్పారు.బనారసి తాండై, బనారసి లాల్ పెడా, తిరంగి బర్ఫీ, బనారసి లాల్ భర్వాన్, లాల్ మిర్చ్ కూడా త్వరలోనే ట్యాగ్‌లు లభిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.