Money: బ్యాంకు లెక్కల్లో తేడా.. రూ.41 లక్షలు తగ్గినట్టు గుర్తించిన మేనేజర్.. అనుమానం వచ్చి సీసీ కెమెరాల్లో చెక్ చేస్తే..!

ABN , First Publish Date - 2023-10-06T15:34:39+05:30 IST

ప్రస్తుతం చాలా మంది సులభంగా డబ్బు సంపాదించే మార్గాల వైపు చాలా త్వరగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్‌ల్లో పాల్గొంటూ అప్పుల పాలవుతున్నారు. ఆ అప్పులు తీర్చలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు మోసాలకు పాల్పడి జైలు పాలవుతున్నారు.

Money: బ్యాంకు లెక్కల్లో తేడా.. రూ.41 లక్షలు తగ్గినట్టు గుర్తించిన మేనేజర్.. అనుమానం వచ్చి సీసీ కెమెరాల్లో చెక్ చేస్తే..!

ప్రస్తుతం చాలా మంది సులభంగా డబ్బు సంపాదించే మార్గాల వైపు చాలా త్వరగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్‌ల్లో (Cricket Betting) పాల్గొంటూ అప్పుల పాలవుతున్నారు. ఆ అప్పులు తీర్చలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు మోసాలకు పాల్పడి జైలు పాలవుతున్నారు. తాజాగా రాజస్థాన్‌ (Rajasthan)లోని కరౌలీకి చెందిన ఓ బ్యాంక్ ఉద్యోగి (Bank employee) తను పని చేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడు. బెట్టింగ్ కు అలవాటు పడి తన పని చేస్తున్న బ్యాంకులోనే రూ.41 లక్షలు మాయం చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు (Crime News).

కరౌలి జిల్లాలోని హిందౌన్ యూనియన్ బ్యాంక్ (Union Bank) మేనేజర్ బ్యాంకులోని నగదును తనిఖీ చేయగా, రూ.41 లక్షలు తక్కువగా ఉన్నట్టు కనుగొన్నారు. ఈ విషయమై క్యాషియర్ జగదేవ్, మరో ఉద్యోగి ప్రేమ్‌రాజ్‌లను విచారించగా.. సాయంత్రంలోగా నగదు జమవుతుందని చెప్పారు. అయినా సాయంత్రం వరకు డబ్బులు తిరిగిరాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి అసలు విషయం బయటపెట్టారు.

Bride: శోభనం రోజు రాత్రి.. తెల్లవారుజామున 4 గంటలకు వరుడికి మెలకువ.. పక్కన భార్య లేకపోవడంతో డౌట్.. వేరే గదిలోకి వెళ్లి చూస్తే..!


జగదేవ్, ప్రేమ్‌రాజ్‌లు పలుసార్లు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకెళ్తున్నట్లు సీసీటీవీలో కనబడింది. దీంతో వారిద్దరినీ పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దాంతో వారు అసలు విషయం చెప్పారు. అజయ్ కుమార్ అనే వ్యక్తి ద్వారా సాఫ్రాన్ ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టామని, డబ్బులు అన్నీ పోయాయని వారు చెప్పారు. దీంతో జగదేవ్, ప్రేమ్‌రాజ్, అజయ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, జగదేవ్, ప్రేమ రాజ్ కుటుంబ సభ్యులు బ్యాంకు నుంచి మాయమైన మొత్తం రూ.41 లక్షలను బ్యాంకుకు తిరిగి చెల్లించారు.

Updated Date - 2023-10-06T15:34:39+05:30 IST