Belly Fat: కూర్చుని చేసే ఉద్యోగం.. బాన పొట్ట తగ్గదులే అని ఫిక్స్ అయిపోయారా..? ఈ 5 డ్రింక్స్‌ను తాగితే చాలు..!
ABN , First Publish Date - 2023-06-29T11:45:31+05:30 IST
ఇక ఈ పొట్ట తగ్గదేమో అనే నిరాశలో ఉన్న వారికి ఈ డ్రింక్స్ గొప్ప వరమనే చెప్పవచ్చు. వీటిని తాగితే బానలాగా ఉన్న పొట్ట అయినా ఐస్ లా కరిగిపోవాల్సిందే..
ఇప్పట్లో ఉద్యోగాలన్నీ కంప్యూటర్లముందు సాగుతున్నవే. గంటల కొద్దీ డెస్కుల ముందు కూర్చుని పనిచేయడం, వేళాపాళ లేకుండా ఆహారం తినడం, కడుపునింపుకోవడానికి బయటి ఆహారాల మీద ఆధారపడటం. ఇవన్నీ కలిసి పొట్ట అనే పెద్ద సమస్యను పెంచుతున్నాయి. చాలామంది సాధారణ ఎత్తుకు తగ్గ బరువు ఉన్నా పొట్ట బయటకు చొచ్చుకు వచ్చి శరీర రూపాన్నంతా పాడుచేస్తుంటుంది. ఈ కారణంగా చిన్నవయసులోనే పెద్దవాళ్ళలా కనబడేవారు చాలామందే ఉన్నారు. దీన్ని తగ్గించుకోవడానికి ఎన్నెన్నో అవస్థలు పడుతుంటారు. కానీ ఆశించిన ఫలితాలు అంతగా ఉండవు. ఈ పొట్ట ఇక తగ్గదేమో అని నిరాశలోకి జారిపోతుంటారు. అయితే పొట్ట తగ్గించుకోవడానికి అద్భుతమైన డ్రింక్స్ ఉన్నాయి. వీటిని తీసుకుంటే బాన పొట్ట అయినా ఐస్ లా కరగాల్సిందే.. అలాంటి 5 అద్భుతమైన డ్రింక్స్ ఏంటో తెలుసుకుంటే..
జీలకర్ర నీళ్ళు..(cumin water)
జీలకర్ర నీళ్ళు బానలాగా ఉన్న పొట్టను కూడా ఎంతో వేగంగా సాధారణ స్థితికి తీసుకురావడంలో బాగా సహాయపడతాయి. రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో 1టీస్పూన్ జీలకర్ర వేయాలి. రాత్రంతా దాన్ని అలాగే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం ఫిల్టర్ చేసుకుని తాగాలి. ఇది పొట్ట కొవ్వును(belly fat) తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
సెలెరీ నీళ్ళు..(celery water)
ఆకుకూరలు ఆరోగ్యమని మనకు తెలిసిందే అయితే ఆకుకూరల నీళ్ళు బరువు తగ్గడంలో తోడ్పడతాయి. సెలెరీని(celery) సన్నగా తరుగుకోవాలి. ఒక స్పూన్ సెలెరీని ఒక కప్పు నీళ్ళలో వేసి బాగా మరిగించాలి. దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇది పొట్టలోపలి కొవ్వును కరిగిస్తుంది. అయితే సెలెరీని అతిగా తీసుకోవడం కడుపు ఉబ్బర సమస్యలకు దారితీస్తుంది కాబట్టి మోతాదు మించకూడదు.
Viral News: ఆ ప్రియుడికి ఇంత ఇగో ఏంటీ..? గుడ్ బై చెప్పండంటూ ఆ యువతికి నెటిజన్ల సలహాలు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!
గ్రీన్ టీ..(Green tea)
గ్రీన్ టీ ప్రస్తుతకాలంలో చాలామంది మార్నింగ్ డ్రింక్ గా మారిపోయింది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ ను మెరుగుపరుస్తుంది. రోజులో రెండు నుండి మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి.
అల్లం, నిమ్మరసం, తేనె..(ginger, lemon, honey)
అల్లం,నిమ్మరసం, తేనె.. ఈ మూడు బరువు తగ్గించడంలో మ్యాజిక్ చేస్తాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తురిమిన అల్లం, నిమ్మరసం, తేనెను కలిపి ఉదయమే తాగాలి. ఇది బరువు తగ్గించడంలోనూ, పొట్ట కొవ్వు కరిగించడంలోనూ చాలా బాగా పనిచేస్తుంది.
మజ్జిగ..(butter milk)
వేసవితాపం తగ్గించడంలోనే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ ఉంచడంలో మజ్జిగ బాగా పనిచేస్తుందని అందరికీ తెలిసిందే. అయితే మజ్జిగ బరువు తగ్గించడంలో కూడా చాల చక్కగా సహాయపడతుంది. తక్కువ కేలరీలతో, ప్రోబయోటిక్స్ మెండుగా కలిగిన మజ్జిగ బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ మజ్జిగలో వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి చిటికెడు(cumin powder), నల్ల ఉప్పు(black salt) చిటికెడు కలిపి తాగుతూ ఉంటే పొట్ట కొవ్వు సులువుగా తగ్గుతుంది.