Kacha Badam: ఇతడెవరో గుర్తు పట్టారా..? కచ్చా బాదమ్ అనే ఒక్క పాటతో వరల్డ్ ఫేమస్ అయ్యాడు కానీ.. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-03-06T15:54:40+05:30 IST
కచ్చా బాదమ్ (Kacha Badam) అనే పాట విన్నారా? ఈ పాట ఎంత పాపులర్ అయిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ పాటతో ఓవర్‌నైట్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు పశ్చిమబెంగాల్‌కు చెందిన భుబన్ బద్యాకర్ (singer). తన పాటతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు ఈ శనగల వ్యాపారి. ఇంత ఫేమస్ అయిన
ఓడలు బండ్లు... బండ్లు ఓడలు అవుతాయి అనే సామెత విన్నారా? అప్పడప్పుడు వింటుంటాం. కొంత మంది పేదరికం నుంచి ఉన్నత స్థితికి.. ఉన్నత స్థితి నుంచి పేదరికానికి పడిపోయిన వారిని ఉద్దేశించి ఇలాంటి సామెతలు ఉపయోగిస్తుంటారు. ఇలాంటి పరిస్థితులు కళ్ల ముందు చూసే ఉంటాం.. వినే ఉంటాం.
కచ్చా బాదమ్ (Kacha Badam) అనే పాట విన్నారా? ఈ పాట ఎంత పాపులర్ అయిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ పాటతో ఓవర్‌నైట్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు పశ్చిమబెంగాల్‌కు చెందిన భుబన్ బద్యాకర్ (singer). తన పాటతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు ఈ శనగల వ్యాపారి. ఇంత ఫేమస్ అయిన భుబన్ బద్యాకర్ పరిస్థితి ఇప్పుడు తలకిందులైంది. ఎంతగా అంటే కనీసం ఇంటి అద్దె కట్టుకోలేని దుస్థితి. పైగా సొంత గ్రామాన్ని వదిలిపెట్టి వేరే చోటికి మకాం మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఏమైందనే కదా? మీడౌట్. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
పశ్చిమబెంగాల్‌కు (West Bengal) చెందిన భుబన్ స్వస్థలం బీర్‌భూం జిల్లాలోని కురల్‌జూరి గ్రామం. పచ్చి పల్లీలు, శనగలు అమ్ముకుంటూ భుబన్ (Bhuban Badyakar) కుటుంబాన్ని పోషించేవాడు. అయితే వేరుశెనగలు అమ్ముతూ కచా బాదం పాడేవాడు. ఈ పాట ఒక్కసారిగా వైరల్ కావడంతో సెన్షేషనల్ స్టార్ అయిపోయాడు. బెంగాల్ పోలీసులు కూడా అతన్ని ప్రశంసించారు. ఇంత పాపులర్ అయిన భుబన్.. ప్రస్తుతం అథఃపాతాళానికి పడిపోయాడు.
సెలబ్రిటీగా మారిన తర్వాత వచ్చిన డబ్బంతా గ్రామస్థులు పలు దఫాలుగా తన నుంచి కాజేశారని భుబన్ ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలోని కొందరు యువకుల వేధింపులు భరించలేక స్వగ్రామాన్ని కూడా విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ప్రస్తుతం గ్రామానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామంలో అద్దె ఇంట్లో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నట్లు తెలిపాడు. మరోవైపు తాను పాడిన కచ్చా బాదమ్ పాటకు కాపీరైట్ (Copyright) రావడం వల్ల ఇప్పుడు ఆ పాటను కూడా పాడలేకపోతున్నానని వాపోయాడు. ప్రస్తుతం పాకుర్తలాలోని ఓ గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఇంటి అద్దె నెలకు రూ.2700 చెల్లిస్తూ అష్టకష్టాలు పడుతున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇది ఎంత కాలం ఉంటుందో చెప్పలేనని భుబన్ వాపోయాడు.
ఇది కూడా చదవండి: షాకింగ్ ఘటన.. పక్కింటి వాళ్లు పెళ్లికి పిలవలేదని ఓ వ్యక్తి వింత నిర్వాకం..!