Viral: ప్రియుడిని కలవడం కోసం గ్రామం మొత్తానికి కరెంట్ తీసేస్తోంది.. చివరకు ఆమె ఎలా దొరికిపోయిందంటే..

ABN , First Publish Date - 2023-07-23T15:15:29+05:30 IST

ఆ యువతి మహా తెలివైనది.. తన ప్రియుడిని కలిసేందుకు అద్భుతమైన స్కెచ్ వేసింది.. గ్రామస్థులందరి కళ్లూ కప్పి తన ప్రియుడిని కలుసుకునేది.. అదే ప్లాన్ ఉపయోగించి చాలా సార్లు తన ప్రియుడిని గ్రామంలోనే కలుసుకునేది.. చివరకు ఒక రోజు ఆ యువతి పథకం విఫలమైంది.. దీంతో ఆమె బండారం బయటపడింది..

Viral: ప్రియుడిని కలవడం కోసం గ్రామం మొత్తానికి కరెంట్ తీసేస్తోంది.. చివరకు ఆమె ఎలా దొరికిపోయిందంటే..

ఆ యువతి మహా తెలివైనది.. తన ప్రియుడిని కలిసేందుకు అద్భుతమైన స్కెచ్ వేసింది.. గ్రామస్థులందరి కళ్లూ కప్పి తన ప్రియుడిని కలుసుకునేది.. అదే ప్లాన్ ఉపయోగించి చాలా సార్లు తన ప్రియుడిని గ్రామంలోనే కలుసుకునేది.. చివరకు ఒక రోజు ఆ యువతి పథకం విఫలమైంది.. దీంతో ఆమె బండారం బయటపడింది.. ప్రియుడితో పాటు బహిరంగంగా గ్రామస్థులకు దొరికిపోయింది.. చివరకు ఆ ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది.. బీహార్‌ (Bihar)లోని బేతియాలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.

బేతియాలోని నైతాన్ ప్రాంతానికి చెందిన ప్రీతి చాలా రోజులుగా ఓ వ్యక్తితో ప్రేమలో (Love Affair) ఉంది. ప్రీతి తన ప్రియుడిని తన గ్రామంలోనే రాత్రి పూట రహస్యంగా కలుసుకోవాలనుకుంది. అందుకోసం ఓ పథకం వేసింది. గ్రామానికి విద్యుత్ సరఫరా (Power Supply ) చేసే లైన్‌ను ప్రియుడి సహాయంతో కట్ చేసేది. ఆ తర్వాత ఇద్దరూ గ్రామంలోనే కలుసుకునేవారు. అలా విద్యుత్ సరఫరా నిలిపేసి ప్రేమికులు ఇద్దరూ తరచుగా కలుసుకునేవారు. తరచుగా కరెంట్ పోతుండడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు కూడా ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోయింది (Bihar girl cuts village power supply to meet lover).

Viral News: ఇదో సీతారామం కథ.. 54 ఏళ్ల తర్వాత సరైన చిరునామాకు చేరిన పోస్ట్ కార్డు.. అందులో ఏముందంటే..

అసలు కరెంట్ ఎందుకు పోతోందో తెలుసుకునేందుకు గ్రామస్థులు నిఘా ఏర్పాటు చేశారు. చివరకు ప్రీతి బండారం బయటపడింది. మామిడి తోటలో ప్రీతి తన ప్రియుడితో అభ్యంతరకర స్థితిలో ఉండగా గ్రామస్థులకు దొరికిపోయింది. ప్రీతి ప్రియుడిని పక్క గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌గా గుర్తించారు. ఇద్దరిపైనా గ్రామస్థులు దాడి చేశారు. ఆ తర్వాత ఇద్దరికీ గ్రామస్థులందరూ కలిసి బలవంతంగా పెళ్లి జరిపించారు.

Updated Date - 2023-07-23T15:15:29+05:30 IST