Viral Video: ఒకరికి హాని చేయాలనుకుంటే మనమే నష్టపోతాం.. కావాలంటే ఈ వీడియో చూడండి..

ABN , First Publish Date - 2023-07-02T16:18:19+05:30 IST

తమ ప్రయోజనం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టేవారు కొందరుంటారు. తమకేం ప్రయోజనం లేకపోయినా, కేవలం సరదా కోసం ఇతరులను ఇబ్బంది పెట్టే శాడిస్టులు మరికొందరు ఉంటారు. అలాంటి వారు వెంటనే కర్మకు తగిన ఫలితం అనుభవిస్తారు. ఇతరులకు హాని కలగించబోయి తామే ప్రమాదంలో పడతారు.

Viral Video: ఒకరికి హాని చేయాలనుకుంటే మనమే నష్టపోతాం.. కావాలంటే ఈ వీడియో చూడండి..

తమ ప్రయోజనం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టేవారు కొందరుంటారు. తమకేం ప్రయోజనం లేకపోయినా, కేవలం సరదా కోసం ఇతరులను ఇబ్బంది పెట్టే శాడిస్టులు మరికొందరు ఉంటారు. అలాంటి వారు వెంటనే కర్మకు తగిన ఫలితం (Instant Karma) అనుభవిస్తారు. ఇతరులకు హాని కలగించబోయి తామే ప్రమాదంలో పడతారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. karma instantâneo అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఇద్దరు యువకులు స్కూటీ (Scooty)పై వెళుతున్నారు. ఆ సమయంలో రోడ్డుపై ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. స్కూటీ వెనకాల కూర్చున్న యువకుడు.. నిడిచి వెళ్తున్న వ్యక్తి (Pedestrian)ని వెనుక నుంచి తలపై కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి శరీరంపై నియంత్రణ కోల్పోయి ముందుకు పడిపోయాడు. ఆ వ్యక్తి పడడం వల్ల స్కూటీ నడుపుతున్న వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో ఆ స్కూటీ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా కింద పడిపోయి గాయాలపాలయ్యారు.

Shocking: కదులుతున్న బస్సులో కండక్టర్ అసభ్యకర చర్య.. ప్యాసింజర్‌తో శృంగారం.. వీడియో తీసిన ప్రయాణికులు!

తన మానాన తను నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని అనవసరంగా వేధించినందుకు ఆ యువకులు తక్షణ కర్మను అనుభవించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 6 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఇన్‌స్టంట్ కర్మ``, ``ఒకరికి హాని కలిగించాలనుకుంటే ఇలాగే అవుతుంది`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-02T16:20:07+05:30 IST