Birth Control Pills: బర్త్ కంట్రోల్ పిల్స్‌ను వేసుకుంటే.. నిజంగా ముఖంపై మొటిమలు తగ్గిపోతాయా..? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..!

ABN , First Publish Date - 2023-09-22T11:17:18+05:30 IST

ఈ మధ్యకాలంలో మొటిమల నివారణ కోసమంటూ గర్భనిరోధక మాత్రలు వాడటం హాట్ టాపిక్ గా మారింది. గర్భనిరోధక మాత్రలు వేసుకుంటే నిజంగానే మొటిమలు తగ్గుతాయా? దీని గురించి డక్టర్లు ఏం చెబుతున్నారంటే..

Birth Control Pills: బర్త్ కంట్రోల్ పిల్స్‌ను వేసుకుంటే.. నిజంగా ముఖంపై మొటిమలు తగ్గిపోతాయా..? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..!

ముఖ అందాన్ని చెడగొట్టడంలో మొటిమలు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. మొటిమలు సాధారణంగా మహిళల నెలసరి సమయంలో వస్తుంటాయి. మరికొందరికి ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. వీటిని వదించుకోవడానికి ఎన్నో పద్దతులు అవలంభిస్తుంటారు. ఈ మధ్యకాలంలో మొటిమల నివారణ కోసమంటూ గర్భనిరోధక మాత్రలు వాడటం హాట్ టాపిక్ గా మారింది. గర్భనిరోధక మాత్రలు వేసుకుంటే నిజంగానే మొటిమలు తగ్గుతాయా? దీని గురించి డక్టర్లు ఏం చెబుతున్నారు? ఇవి ఎంత సురక్షితం.. మొదలైన వివరాలు తెలుసుకుంటే..

మొటిమలు(pimples) నయం చేయడానికి గర్భనిరోధక మాత్రలు బాగా పనిచేస్తాయంటూ ఈ మధ్య కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా వీటిని ఉపయోగించం మంచిది కాదని మహిళా ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ కొన్ని సందర్బాలలో వీటిని ఉపయోగించాల్సివస్తుంది. ముఖ్యంగా మహిళలలో పిసిఒఎస్(pcos), పిసిఒడి(pcod) సమస్యలున్నప్పుడు మొటిమల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మొదట ఎండోక్రినాలజిస్ట్, గైనకాలజిస్ట్, డెర్మటాలజిస్ట్ నిపుణులను సంప్రదించాలి. ముఖం మీద వస్తున్న మొటిమలు పిసిఒస్, పిసిఒడి సమస్యల కారణంగానే వస్తున్నాయా లేదా మరేదైనా కారణం ఉందా అనే విషయాన్ని టెస్టులు చేయించుకోవడం ద్వారా తెలుసుకోవాలి. ఈ టెస్టులలో మొటిమలకు పిసిఒఎస్, పిసిఒడి కారణం అని తేలితే అలాంటి సందర్బాలలో డాక్టర్లే గర్భనిరోధక మాత్రలు రాసిస్తారు. పిసిఒఎస్, పిసిఒడి అనేవి హార్మోన్ల అసమతుల్యత కారణంగా సంభవించే సమస్యలు. గర్భనిరోధక మాత్రలు హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. దీనికారణంగా మొటిమలు కూడా తగ్గుతాయి. కొన్ని సందర్బాలలో మొటిమలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

Viral Video: ఇలాంటి ప్రేయసి దక్కినందుకు అతడు నిజంగా అదృష్టవంతుడంటూ.. నెటిజన్ల ప్రశంసలకు కారణమేంటంటే..!


గర్భనిరోధక మాత్రలు మొటిమలకు మంచి చికిత్స అయినా వాటిని ఎవరికి వారు కొని వాడటం చాలా ప్రమాదం. వైద్యులను సంప్రదించిన తరువాత వైద్యులు రికమెండ్ చేస్తేనే వీటిని వాడాలి. కేవలం ఈ మాత్రలే కాదు, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా మొటిమల సమస్యలు తగ్గుతాయి. శరీరాన్ని డిటాక్స్ చేసే ఆహారాలు, పానీయాలు తీసుకోవాలి. మెరుగైన జీవనశైలికి మారకపోతే ఎన్ని మాత్రలు వేసుకున్నా పిసిఒఎస్ సమస్యలు అధిగమించలేరు.

Husband: భార్యను చంపి 15 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న భర్త.. ఒకే ఒక్క క్లూ‌ తో పోలీసులు ఎలా పట్టేశారంటే..!


Updated Date - 2023-09-22T11:17:18+05:30 IST