Black Ants: చీమలు పట్టిన డ్రింక్‌ను కాస్ట్‌లీ ధరకు అమ్మేస్తున్నారు..చుశారా మీరు?
ABN , Publish Date - Dec 31 , 2023 | 04:59 PM
మీరెప్పుడైనా నల్ల చీమలు పట్టిన డ్రింక్ సేవించారా? లేదా అయితే ఈ వీడియో చూసేయండి. ఎందుకంటే ఓ ప్రాంతంలో అలాంటి పానీయాన్ని మంచి రేటుకు అమ్ముతున్నారు.
సాధారణంగా ఎక్కడైనా ఆహారానికి లేదా సేవించే పానీయాలకు నల్ల చీమలు(black Ants) పడితే వాటిని తీసేయడానికి ప్రయత్నిస్తాం. కానీ ఇటివల ముంబయి(mumbai) నగరంలో సరికొత్త ట్రెండ్ కొనసాగుతుంది. ఏకంగా నల్ల చీమలతో ఉన్న కాక్‌టెయిల్ డ్రింక్‌ను సేల్ చేస్తున్నారు. అంతేకాదు ఒక్క గ్లాసు పానీయానికి(garnish cocktail) 960 రూపాయలు తీసుకుంటున్నారు. అయితే దీనిని సేవించిన ఇన్‌స్టాగ్రామర్ నితిన్ తివారీ వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
అయితే కాక్‌టెయిల్ అనే పానీయాన్ని ఆల్కహాల్ మిశ్రమంతోపాటు అనేక రకాలుగా తయారు చేస్తారు. ఈ క్రమంలోనే నితిన్ తివారీ ఓ అరుదైన సీఫాలో గార్నిష్ (చీమల)కాక్‌టెయిల్(cocktail) పానీయాన్ని పరిచయం చేశాడు. అతను ముంబయిలో దానిని ప్రయత్నించినట్లు వెల్లడించారు. అంతేకాదు మీరు కూడా కాక్‌టెయిల్‌లను ఇష్టపడితే దీనిని ఓసారి ట్రై చేయాలని వీడియోలో పేర్కొన్నాడు. ఆ డ్రింక్ ఓ గ్లాసులో తెల్లటి రంగులో ఉండగా..ఆ గ్లాసుకు నల్ల చీమలు అంటుకుని ఉండటం వీడియోలో చూడవచ్చు.
ఈ వీడియో కొన్ని నెలల క్రితం షేర్ చేయగా అప్పటి నుంచి దీనిని అనేక మంది షేర్ చేస్తుండగా మరికొంత మంది మాత్రం దీనిని చూసి పలు రకాలుగా కామెంట్లు(comments) చేస్తున్నారు. అసలు ఆ డ్రింక్ రుచి ఎలా ఉందని ఓ వ్యక్తి ప్రశ్నించగా..మరోవ్యక్తి నో అది వద్దని అన్నారు. ఇంకోకరైతే ఇలాంటి డ్రింక్ కూడా ఉందా నాయానా అంటూ వ్యాఖ్యానించగా..మరోకరు నల్ల చీమలు అలా ఉంచడం వల్ల ఉపయోగం ఎంటని ప్రశ్నించారు. అయితే ఈ డ్రింక్ గురించి మీకు తెలుసా? తెలిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.