Viral News: అమ్మ బాబోయ్.. ఈ ఒక్క చేప ఖరీదు ఏకంగా రూ.2 కోట్లా.. అని అవాక్కవుతున్నారా..? దీని మరో స్పెషాలిటీ ఏంటో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-04-20T17:05:48+05:30 IST

సముద్రంలో దొరికే ఈ చేప ఖరీదు ఎంతో తెలిస్తే మాత్రం అమ్మ బాబోయ్ అనాల్సిందే.

Viral News: అమ్మ బాబోయ్.. ఈ ఒక్క చేప ఖరీదు ఏకంగా రూ.2 కోట్లా.. అని అవాక్కవుతున్నారా..? దీని మరో స్పెషాలిటీ ఏంటో తెలిస్తే..!
Viral News

మత్స్య సంపదలో ఎన్నో రకాలైన జాతులున్నాయి. ఒక్కోదానిది ఒక్కో రుచి. మంచినీటిలో పెంచేవి ఉంటాయి. సముద్రాల్లో పెరిగేవి ఉంటాయి. ఇక చేప వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిసిందే. ఇక వీటి ఖరీదు గురించి మాట్లాడితే.. ఒక్కో చేపను బట్టి ఒక్కో ధర ఉంటుంది. మా అయితే వందల్లోనో.. వేలల్లోనో ఉంటుంది. కానీ అట్లాంటిక్ సముద్రంలో దొరికే ఈ చేప ఖరీదు ఎంతో తెలిస్తే మాత్రం అమ్మ బాబోయ్ అనాల్సిందే.

మనకు అప్పుడప్పుడు గోదావరికి వరదలు వచ్చినప్పుడో... లేదంటే కొత్త నీరు వచ్చినప్పుడో పులసలు దొరుకుతుంటాయి. వీటి ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. వందల్లో కాకుండా వేలల్లో ఉంటుంది. దీని రుచి కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఎంత ఖరీదైనా దీన్ని కొంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప ఏదో తెలుసా..! బ్లూఫిన్ ట్యూనా (Bluefin tuna) అని చెప్పకతప్పదు. దీని ఖరీదు అక్షరాలా రూ.2 కోట్లు(2 crore) . అవ్వాక్కయ్యారా? మీరు చదివింది నిజమే.

అట్లాంటిక్ సముద్రంలో ఉండే ఈ చేప గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అంతేకాదు చాలా వేగంగా ఈత కొడుతుంది. ఈ చేప 3 మీటర్ల పొడవు ఉంటుంది. 250 కేజీల వరకు బరువు ఉంటుంది. ఇది ఇతర చిన్న చేపలను ఆహారంగా తింటుంది. దీనికి మనిషికి ఉన్నట్టుగానే వేడి రక్తం ఉంటుంది. ఈ చేపలో ప్రొటీన్లు, గుండెకు మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ చేపను ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.

జపాన్‌ (Japan) రాజధాని టోక్యోలోని టోయోసు చేపల మార్కెట్‌లో జెయింట్ బ్లూఫిన్ ట్యూనాను వేలం వెయ్యగా రూ.2 కోట్లు పలికింది. ఆ బ్లూఫిన్ ట్యూనా 212 కేజీల బరువు ఉంది. చూడటానికి భయంకరంగా ఉండే ఈ చేపలు చాలా మొండివి. సముద్రంలో మిగతా చేపలపై ఇవి ఆధిపత్యం ప్రదర్శిస్తుంటాయి. సముద్ర గర్భంలోనూ ఇవి వేగంగా దూసుకెళ్లగలవు. ఈ చేపలు సుమారు 40 సంవత్సరాలు బతుకుతాయి. అంతరించిపోయే దశలో ఉన్నందున ప్రస్తుతం బ్లూఫిన్ ట్యూనా చేపల వేటను నిషేధించారు. వీటిని వేటాడుతూ పోలీసులకు పట్టుబడితే మాత్రం జైలుతో పాటు జరిమానా కూడా విధిస్తారు.

ఇది కూడా చదవండి: Viral Video: పెంపుడు కుక్కను తీసుకుని పార్కుకు వెళ్తే షాకింగ్ అనుభవం.. ప్రాణభయంతో పరుగులు తీసిన మహిళ..!

ఇది కూడా చదవండి: Husband: 11 బస్తాల్లో 10 రూపాయల నాణేలు.. నేరుగా కోర్టుకే తెచ్చిచ్చిన భార్యపై వెరైటీగా కసి తీర్చుకున్న భర్త..!

Updated Date - 2023-04-20T17:05:48+05:30 IST