Viral: నేను తాగి ఉన్నా.. అంటూ మద్యం మత్తులో బాస్‌కు ఉద్యోగి మెసేజ్.. ఆ బాస్ రియాక్షన్ ఏంటంటే..
ABN , First Publish Date - 2023-08-06T12:08:50+05:30 IST
సాధారణంగా ఒకే సంస్థలో పని చేసే బాస్, ఉద్యోగి మధ్య అనుబంధం అంతంత మాత్రంగానే ఉంటుంది. పని విషయంలోనే ఉద్యోగిని బాస్ ఒత్తిడి చేయడం, బాస్‌పై ఉద్యోగులు జోక్‌లు వేసుకోవడం సర్వ సాధారణంగా కనిపిస్తుంటుంది. అందులోనూ ఒక ఉద్యోగి ఫుల్‌గా మద్యం సేవించి బాస్‌కు మెసేజ్ చేశాడంటే అది ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా ఒకే సంస్థలో పని చేసే బాస్ (Boss), ఉద్యోగి (Employee) మధ్య అనుబంధం అంతంత మాత్రంగానే ఉంటుంది. పని విషయంలోనే ఉద్యోగిని బాస్ ఒత్తిడి చేయడం, బాస్‌పై ఉద్యోగులు జోక్‌లు వేసుకోవడం సర్వ సాధారణంగా కనిపిస్తుంటుంది. అందులోనూ ఒక ఉద్యోగి ఫుల్‌గా మద్యం సేవించి బాస్‌కు మెసేజ్ చేశాడంటే అది ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ బాస్, ఉద్యోగి మధ్య జరిగిన ఛాటింగ్ వైరల్ అవుతోంది. ``బాస్.. నేను తాగి ఉన్నా`` అంటూ బాస్‌కు ఆ ఉద్యోగి మెసేజ్ పంపించాడు (Boss Receives Drunk Text From Employee).
ఇద్దరి మధ్య జరిగిన హృద్యమైన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ (Viral)గా మారింది. సిద్ధాంత్ అనే వ్యక్తి తన ఉద్యోగి పంపించిన మెసేజ్ స్క్రీన్ షాట్‌లను ట్విటర్‌లో షేర్ చేశాడు. మద్యం మత్తు (Drunken)లో ఉన్న ఓ ఉద్యోగి తన బాస్‌పై ప్రశంసలు కురిపిస్తూ మెసేజ్ చేశాడు. ``బాస్.. నేను తాగి ఉన్నా. నేను మీకు ఓ విషయం చెప్పాలి. నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు. నాకు కష్టమైన ఛాలెంజ్‌లు ఇచ్చినందుకు థ్యాంక్స్. మంచి కంపెనీ కంటే మంచి మేనేజర్ దొరకడం అదృష్టం. ఆ విషయంలో నేను లక్కీ`` అంటూ బాస్‌కు ఆ ఉద్యోగి మెసేజ్ పంపించాడు.
Anand Mahindra: కష్టాలను ఎలా దాటాలో ఈ ఏనుగును చూసి నేర్చుకోండి.. స్ఫూర్తిదాయక ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా!
ఆ మెసేజ్ స్క్రీన్ షాట్‌ను ట్విటర్‌లో షేర్ చేసిన సిద్ధాంత్.. ``తాగేసి ఉన్న ఉద్యోగి నుంచి మెసేజ్‌లు ఫర్వాలేదు? కానీ, మీకు ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయా`` అని కామెంట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు లక్షల మందికి పైగా ఈ పోస్ట్‌ను వీక్షించారు. ``మీరు చాలా మంచి బాస్. మీరు చాలా విషయాలు సరిగ్గా చేస్తున్నారు``, ``మీ దగ్గర పని చేసేవారు అదృష్టవంతులు``, ``మద్యం మత్తులో బయటకు వచ్చినది నిజాయితీగా ఉంటుంది. మీ నాయకత్వ లక్షణాలు గొప్పవి`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.