Viral Video: నడిరోడ్డుపై అమ్మాయి, అబ్బాయి స్నానం.. స్కూటీపై వారు చేస్తున్న పని చూసి నవ్వుకున్న జనం.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2023-05-21T14:59:37+05:30 IST

ప్రస్తుతం భారతదేశంలోని అనేక ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతతో అల్లాడుతున్నాయి. తీవ్ర వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వేడిని తట్టుకోవడానికి ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వేసవిలో కొందరు కూల్ డ్రింక్‌లు తాగడానికి ఇష్టపడతారు.

Viral Video: నడిరోడ్డుపై అమ్మాయి, అబ్బాయి స్నానం.. స్కూటీపై వారు చేస్తున్న పని చూసి నవ్వుకున్న జనం.. వీడియో వైరల్!

ప్రస్తుతం భారతదేశంలోని అనేక ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతతో (High temperature) అల్లాడుతున్నాయి. తీవ్ర వేడిగాలులతో (Heat Waves) ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వేడిని తట్టుకోవడానికి ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వేసవిలో (Summer) కొందరు కూల్ డ్రింక్‌లు తాగడానికి ఇష్టపడతారు. మరికొందరు తరచుగా స్నానం (Bath) చేయడానికి ఇష్టపడతారు. ఈ వేసవి హీట్‌పై ఓ యువతీ యువకుడు వినూత్నంగా స్పందించారు.

రోడ్లపై కారుల్లో ప్రయాణించేవారు చక్కగా ఏసీలు వేసుకుని ప్రయాణం చేయవచ్చు. మరి, బైక్‌లో వెళ్లేవారు ఏం చెయ్యాలి? ఇదిగో.. ఇలా వీడియోలో చూపించినట్టు చేస్తే బాగుంటుందేమో. వైరల్ అవుతన్న ఆ వీడియోలో ఓ యువతి, యువకుడు స్కూటీ మీద వెళుతూ ఓ సిగ్నల్ దగ్గర ఆగారు. వారిద్దరి మధ్యలో బకెట్‌తో నీళ్లు ఉన్నాయి. వెనుక కూర్చున్న యువతి ఆ బకెట్‌లో నుంచి నీళ్లు తీసి స్నానం చేసింది. ఆ తర్వాత బైక్ నడుపుతున్న యువకుడిపై కూడా వేసింది (Boy and girl take bath while riding).

Viral Video: అబ్బా.. ఈ తాతకు ఎంత ఆనందమో.. యువతిని పెళ్లి చేసుకున్నాననే ఆనందంతో ఎలా నవ్వుతున్నాడో.. వీడియో వైరల్!

నడిరోడ్డుపై ఆ యువతి, యువకులు చేస్తున్న పని చూసి చుట్టూ ఉన్న వారు నవ్వుకున్నారు. వారు బైక్ మీద కూడా స్నానం చేస్తూనే వెళ్లారు. వారి చర్యలను ఒకరు రికార్డు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)అవుతోంది. మహారాష్ట్రలోని థానేలో (Thane) చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి పోలీసుల వరకు వెళ్లింది. ఆ ఇద్దరిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Updated Date - 2023-05-21T14:59:37+05:30 IST