Viral Video: ఓరి బుడ్డోడా.. నీకు ధైర్యం కూసింత ఎక్కువేరోయ్.. నెటిజన్లను స్టన్ చేస్తున్న వీడియో..!

ABN , First Publish Date - 2023-02-19T12:52:58+05:30 IST

ప్రతిరోజూ నెట్టింట చాలా వీడియోలు వైరల్ (Viral Video) అవుతుంటాయి.

Viral Video: ఓరి బుడ్డోడా.. నీకు ధైర్యం కూసింత ఎక్కువేరోయ్.. నెటిజన్లను స్టన్ చేస్తున్న వీడియో..!

Viral Video: ప్రతిరోజూ నెట్టింట చాలా వీడియోలు వైరల్ (Viral Video) అవుతుంటాయి. వాటిలో కొన్ని చాలా స్టన్నింగ్ ఉంటాయి కూడా. అలాంటి వీడియోలను చూడగానే అసలు ఇదేలా సాధ్యం అనే అనుమానం కూడా వస్తుంది. ఇదే కోవకు చెందిన ఓ బుడ్డోడి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓరి బుడ్డోడా నీకు ధైర్యం కూసింత ఎక్కువేరోయ్ అని అంటున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ చిన్నోడు తన వీపుపై ఓ బేబీ మొసలిని ఎత్తుకేళ్లడం. అవును మీరు విన్నది నిజమే. ఆ చంటోడు నిజంగానే పిల్ల మొసలిని తన వీపు వెనుక వైపు వేసుకుని వెళ్లడం మనం ఆ వీడియోలో చూడొచ్చు. అదేదో చిన్న పిల్లలను వేసుకుని వెళ్లినట్టే మనోడు అలా ఆ బేబీ మొసలిని ఎత్తుకుని వెళ్తున్నాడు.

ఆ సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో (Social Media) పెట్టారు. దాంతో ఈ బుడ్డోడి వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ట్విటర్‌లో ఇప్పటివరకు 3.8లక్షల వ్యూస్,15వేల వరకు లైక్స్ వచ్చి పడ్డాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు స్టన్ అవుతున్నారు. దీనిపై తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. 'పాపం.. మొసలి అలసిపోయి ఉంటుంది. అందుకే రెస్ట్‌లో ఉంది' అని ఒకరు, 'మొసలి స్పృహలో లేదు. అందుకే పిల్లోడు దాన్ని అలా ఇంటికి తీసుకెళ్తున్నాడు' మరోకరు, 'జాగ్రత్తరా.. బుడ్డోడా. నిజంగానే ఈ వీడియో స్టన్నింగ్ ఉందని' ఇంకోకరు కామెంట్ చేశారు. ఇంకేందుకు ఆలస్యం మీరు బుడ్డోడి వీడియోపై ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి: అమ్మ బాబోయ్.. ఇలాంటి కూతుళ్లున్న తండ్రుల పని ఔటే.. తల్లి వద్ద తండ్రిని ఎలా ఇరికించేసేందో చూడండి..!

Updated Date - 2023-02-19T12:56:03+05:30 IST