పాపం.. సరదాగా అంటే సీరియస్‌గా తీసుకుంది.. ప్రియుడిని చంపేసి వెళ్లిపోయింది.. చివరకు..
ABN , First Publish Date - 2023-03-17T16:06:02+05:30 IST
అతడు ప్రియురాలిని తరచుగా వేధించేవాడు. తమ శృంగారాన్ని మొబైల్ ద్వారా వీడియో తీసి ఆమెను బెదిరించేవాడు. ఆమె నుంచి నగలు, డబ్బు తీసుకున్నాడు.
అతడు ప్రియురాలిని తరచుగా వేధించేవాడు. తమ శృంగారాన్ని మొబైల్ ద్వారా వీడియో తీసి ఆమెను బెదిరించేవాడు. ఆమె నుంచి నగలు, డబ్బు తీసుకున్నాడు. చివరకు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య మరణించాడు (Girl friend killed boy Friend). ఈ ఘటన గురించి తెలుసుకుంటే ఎవరైనా షాక్ అవక తప్పదు. ఝార్ఖండ్‌లోని (Jharkhand) జంషెడ్‌పూర్‌లో ఈ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. జంషెడ్‌పూర్‌కు చెందిన సుభోద్ అనే యువకుడు ఏడాదిన్నరగా ఓ యువతితో ప్రేమయాణం సాగిస్తున్నాడు.
సుభోద్ ప్రేమ గురించి అతడి కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. వీరిద్దరూ బరిగోడ ప్రాంతంలో అద్దెకు ఇల్లు తీసుకుని రహస్యంగా కలుసుకునేవారు. అక్కడ శృంగారం (Romance) సాగించేవారు. తమ శృంగారాన్ని సుభోద్ మొబైల్ ద్వారా వీడియో తీసి దానితో ప్రేయసిని బెదిరించేవాడు (Black Mail). ఆమె నుంచి నగలు, డబ్బు తీసుకున్నాడు. బుధవారం సాయంత్రం వీరిద్దరూ తమ అద్దె ఇంటికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఆల్కహాల్ (Alcohol) సేవించి ఆ తర్వాత శృంగారంలో పాల్గొన్నారు. అనంతరం ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో ప్రేయసిని భయపెట్టాలని సుభోద్ అనుకున్నాడు.
Viral Post: 5వ తరగతి చదువుతున్న నా కొడుకు రాసిన ఎగ్జామ్ పేపర్ ఇదీ.. అంటూ ఓ తండ్రి పోస్ట్.. నెటిజన్ల నుంచి అనూహ్య రెస్పాన్స్..!
ఆమె చున్నీని తీసుకుని ఫ్యాన్‌కు ఉరిలా బిగించాడు. స్టూల్ ఎక్కి దానిని మెడకు తగిలించుకున్నాడు. తాను చెప్పినట్టు వినకపోతే ఉరేసుకుని చనిపోతానని బెదిరించాడు. అప్పటికే కోపంలో ఉన్న ప్రేయసి ఆ స్టూల్‌ను తన్నేసింది. అంతేకాదు చున్నీని మరింత బిగించి పట్టుకుంది. దీంతో సుభోద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువతి వెంటనే తన నగలు, డబ్బు తీసుకుని వెళ్లిపోయింది. అనంతరం ఇంటి యజమాని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుభోద్ ప్రియురాలి గురించి తెలుసుకుని ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె పోలీసుల ముందు నిజం అంగీకరించింది.