Brave Abhinandan: 60గంటలు పాకిస్తాన్ నిర్భంధంలో భారతీయ వీరుడు.. ఈయన సాహసం గుర్తుచేసుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయ్..

ABN , First Publish Date - 2023-03-01T12:07:13+05:30 IST

ఇతనికోసం యుద్దానికైనా సిద్దమన్న భారత్ ఉగ్రరూపానికి భయపడి పాకిస్థాన్ సరిగ్గా నాలుగేళ్ళ క్రితం

Brave Abhinandan: 60గంటలు పాకిస్తాన్ నిర్భంధంలో భారతీయ వీరుడు.. ఈయన సాహసం గుర్తుచేసుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయ్..

సీతారామం సినిమా చూసిన వారికి రామ్ దేశభక్తి ఎంత గొప్పదో అర్థమై ఉంటుంది. ప్రాణాలు పోగొట్టుకోవడానికి అయినా సిద్దపడతాడు కానీ దేశ రహస్యాలు పెదవి దాటనివ్వడు రామ్. ఇలా దేశభక్తిని మాటల్లో కాకుండా చేతుల్లో చూపిన వీరులను చూసినా, వారి గురించి విన్నా ఒళ్ళు పులకరించిపోతుంది. పాకిస్థాన్ చేతులకు చిక్కి భారత్ రహస్యం వారికి తెలియకూడదనే ఉద్దేశంతో తనదగ్గరున్న డాక్యుమెంట్స్ ను నమిలి మింగేసి స్పూర్తిని ప్రదర్శించిన అభినందన్ వర్థమాన్, 60 గంటల పాటు పాకిస్థాన్ నిర్భంధంలలో ఉన్నాడు. ఇతనికోసం యుద్దానికైనా సిద్దమన్న భారత్ ఉగ్రరూపానికి భయపడి పాకిస్థాన్ సరిగ్గా నాలుగేళ్ళ క్రితం మార్చి 1వ తేదీన అభినందన్ ను భారత్ కు అప్పగించింది. అప్పటి ఆయన సాహసపోరాటాన్ని, ఆయన్ను గుర్తుచేసుకుంటే..

అభినందన్ వర్ధమాన్(Abhinandan Varthaman) సొంతూరు తమిళనాడు(Tamilnadu) రాష్ట్రం కాంచీపురం(Kanchipuram). అతని తండ్రి రిటైర్డ్ ఎయిర్ మార్షల్(Retaired Air Marshal), ఈయన తల్లి డాక్టర్(Doctor). అభినందన్ NDA పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 2004లో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా(Flying Officer) నియమితులయ్యాడు. అతను ఇంతకుముందు సుఖోయ్-30(Sukhoi-30) స్క్వాడ్రన్‌కు పైలట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత MIG-21 స్క్వాడ్రన్‌లో చేరాడు. 2019,ఫిబ్రవరి 27న వింగ్ కమాండర్ అభినందన్(Wing commandor Abhinandan) తన MiG-21 విమానం నుండి పాకిస్తాన్ F-16 విమానాన్ని కూల్చేశాడు. బాలాకోట్(Balakot) లో వైమానిక దాడి తరువాత భారత్ వైమానిక దళం అప్రమత్తమైంది. పాకిస్తాన్ విమానాలను పర్యవేక్షించే బాధ్యతను వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు అప్పగించారు.

Read also: Bank holidays in March 2023: మార్చి నెలలో బ్యాంకులకు ఇన్ని సెలవులా..? ఈ నెలలో ఎన్ని పండుగలు ఉన్నాయంటే..


బాలాకోట్ దాడి తరువాత పాక్ యుద్ద విమానాలు కశ్మీర్ లోకి చొరబడే అవకాశం ఉందని వీరికి సమాచారం అందింది. దీన్ని నిజం చేస్తూ పాకిస్తాన్ F-16 యుద్దవిమానాలు భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించాయి. దీనికి భారత్ ధీటుగా బదులిచ్చింది.వెనక్కు తగ్గని పాక్ తొమ్మిది F-16 యుద్దవిమానాలను పంపింది. ఈ విమానాలు చాలా తక్కవ ఎత్తులో ఎగురుతూ భారతదేశ చమురు గిడ్డంగిని, ఆర్మీ మందుగుండు సామగ్రిని, ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని పేల్చేశాయి. భారత్‌కు చెందిన సుఖోయ్‌ SU-30, MIG-21 విమానాలు పాకిస్థాన్‌కు చెందిన జెట్‌ F-16ను ఢీకొన్నాయి. దీన్నే ఎయిర్‌ఫోర్స్ భాషలో డాగ్ ఫైట్(Dog Fight in AIrforce Language) అంటారు. MIG-21 లో వింగ్ కమాండర్ అభినందన్ ఉన్నాడు. ఇతను పాకిస్తాన్ యుద్దనౌక పని పట్టే బాధ్యత తీసుకున్నాడు. సుఖోయ్ యుద్దనౌక చమురు గిడ్డంగిని కాపాడుకునే ప్రయత్నంలో పడింది. అభినందన్ పాకిస్తాన్ యుద్దనౌకను వెంబడిస్తూ భారత్ సరిహద్దు దాటి పాక్ లోకి ప్రవేశించాడు. ఇదే సమయంలో అతను బారెల్ రోల్(Barrel Roll) ప్రయోగానికి సిద్దపడ్డాడు. ఇందులో అభినందన్ యుద్దవిమానం కూలిపోవడం ప్రారంభించింది. ఇది గమనించిన అభినందన్ పారాచూట్ సహాయంతో బయటపడ్డాడు.

ఇతను అటవీ ప్రాంతంలో ల్యాండ్ అయ్యాడు. ఓ చెట్టు కింద కూర్చుని ఉండగా అతని దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు.'ఇది భారతే కదా.. మీకు భారత్ లోనే నివసిస్తున్నారు కదా..' అని అభినందన్ అడగాడు. ఆ వ్యక్తి అవునని అబద్దం చెప్పాడు. తాను భారత్ లోనే దిగాననే సంతోషంతో అభినందన్ 'జైహింద్' అని అరిచాడు. ఆ తరువాత చేతిలో తుపాకీ పట్టుకుని చేతులు రెండు పైకెత్తి 'కాళీమాతాకీ జై' అని అరిచాడు. అయితే అతను ల్యాండ్ అయిన ప్రాంతం పాకిస్థాన్ ది కావడంతో వారికి కోపం వచ్చింది. వెంటనే 'పాకిస్తాన్ జిందాబాద్' అని ఓ యువకుడు అరిచాడు. ఇక్కడి నుండి నాటకీయ పరిణామాలు జరిగాయి. పాకిస్తాన్ నినాదంతో తాను భారత్ లో లేననే విషయం అభినందన్ కు అర్థమైంది. వెంటనే తన పాకెట్ లో ఉన్న పేపర్స్ బయటకు తీసి కొన్ని ఉండగా చుట్టి నమిలి మింగేశాడు. కొన్నిపేపర్స్ పెద్దగా ఉండటంతో వాటిని చింపేశాడు. కొన్ని పేపర్స్ ను అక్కడి యువకులు లాక్కున్నారు. అక్కడున్న ప్రజలు తనను ఏమైనా చేస్తారని ప్రాణరక్షణ కోసం అభినందన్ తన తుపాకీతో గాల్లో కాల్ఛాడు. కానీ దీనివల్ల పాకిస్తాన్ పౌరులు కోపోద్రిక్తులయ్యారు. అభినందన్ వారు తనను ఏమైనా చేస్తారని పరుగులు తీశాడు. వారు ఆయన్ను వెంబడించి పట్టుకుని కొట్టారు. అతను పారిపోకుండా చుట్టుముట్టారు. తరువాత పాకిస్తాన్ ఆర్మీకి అప్పగించారు. ఇదంతా జరిగిన తరువాత భారత్ కు పాకిస్తాన్ కు మధ్య పెద్ద యుద్దం జరుగుతుందనే న్యూస్ దుమారం లేపింది.

పాక్ లో పౌరులు అభినందన్ ను కొట్టడం, అతని ముక్కుల్లో, కంటి కింద భాగంలో రక్తమోడుతూ ఉండటం వీడియోలు తీసి విడుదల చేశారు. వీటిని చూసి భారతీయులు రగిలిపోయారు. రెండు దేశాలు వేడిక్కిపోయాయి. అభినందన్ కోసం భారత్ అణుయుద్దానికైనా సిద్దపడుతుందనే విషయం ఇతర దేశాలనూ కలవరపెట్టింది. యుద్ద ఉద్దేశం లేదని పాకిస్తాన్ పార్లమెంట్ సంయుక్త సమావేశం నిర్వహించి అభినందన్ ను విడుదల చేయాలని నిర్ణయించింది. 'శాంతి సంజ్ఞ' పేరుతో అభినందన్ ను మార్చి 1వ తేదీన తెల్లవారుజామున సగౌరవంగా వాఘా-అట్టారీ సరిహద్దుకు తీసుకువచ్చి అప్పగించారు.అభినందన్ పాకిస్తాన్ నుండి తిరిగి వచ్చాక పదోన్నతి పొంది గ్రూప్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. 2021 నవంబర్‌లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా వీర చక్ర అవార్డు అందుకున్నాడు. శత్రువు చేతికి చిక్కి ప్రాణాలతో బయటపడిన భారతీయ వీరులు బహు అరుదు. అందునా పాకిస్తాన్ సగౌరవంగా అభినందన్ ను అప్పగించడంతో భారత్ శక్తి ప్రపంచానికి అర్థమైంది. ఈ వీరుడి సాహసం దేశాన్ని ఓ ఊపు ఊపేసింది.

Updated Date - 2023-03-01T12:07:13+05:30 IST