Marriage Video: పెళ్లికి వచ్చిన బంధువులంతా అవాక్కయ్యేలా పక్కా ప్లాన్.. లాస్ట్ మినిట్‌లో బెడిసికొట్టిన వధూవరుల ఫీట్..!

ABN , First Publish Date - 2023-09-26T18:22:40+05:30 IST

జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టమైన వివాహ వేడుకను వీలైనంత గ్రాండ్‌గా, మరపురానిదిగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకోసం అవసరమైతే అప్పులు చేసి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ప్రీ-వెడ్డింగ్ షూట్, హల్దీ, మెహందీ దగ్గర్నుంచి పెళ్లి వేడుక అంతా గ్రాండ్‌గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు

Marriage Video: పెళ్లికి వచ్చిన బంధువులంతా అవాక్కయ్యేలా పక్కా ప్లాన్.. లాస్ట్ మినిట్‌లో బెడిసికొట్టిన వధూవరుల ఫీట్..!

జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టమైన వివాహ (Marriage) వేడుకను వీలైనంత గ్రాండ్‌గా, మరపురానిదిగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకోసం అవసరమైతే అప్పులు చేసి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ప్రీ-వెడ్డింగ్ షూట్, హల్దీ, మెహందీ దగ్గర్నుంచి పెళ్లి వేడుక అంతా గ్రాండ్‌గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్ల వల్ల పెళ్లి వేడుకలో అపశృతులు దొర్లుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. పెళ్లి వేదిక మీదకు వధూవరులు గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు అంతా సిద్ధంగా ఉంది. వేదిక వెనుక ఏర్పాటు చేసిన క్రేన్ సహాయంతో వధూవరులను వేదిక మీదకు దించుతున్నారు. స్పెషల్‌గా ఫైర్ ఎఫెక్ట్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో అపశృతి దొర్లింది. తాడు తెగిపోవడంతో వధూవరులు ఉన్న ట్రాలీ వేగంగా కింద పడిపోయింది. దీంతో వధూవరులు తల్లకిందులుగా కింద పడిపోయారు (Accident in Wedding).

Shocking Video: షూ లను వాడే అలవాటుందా..? ఒక్కసారి ఈ వీడియోను చూస్తే.. ఇకపై ప్రతిరోజూ వాటిని వేసుకునేముందే..!

ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``పాపం.. వధూవరులు ఆ ఎంట్రీని జీవితాంతం మర్చిపోలేరు``, ``ఆ ఈవెంట్ మేనేజర్ ఆమె ఎక్స్ అయి ఉంటాడు``, ``పెళ్లిలో ఇలాంటి ప్రమాదకర సాహసాలు అవసరమా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-09-26T18:22:40+05:30 IST