Bride: చేతిపై మెహందీతో వరుడి పేరును రాయకుండా భారీ ట్విస్ట్ ఇచ్చిన వధువు.. ఆమె చేతిపైన రాతలను చదివి అవాక్కైన బంధువులు..!

ABN , First Publish Date - 2023-04-07T18:04:47+05:30 IST

అమ్మాయి చేతికి గోరింటాకు పెట్టేటప్పుడు పెళ్ళికొడుకు పేరును(Groom name) రాయడం జరుగుతుంది. కానీ తన మెహందీ వేడుకలో చేతిపైన పెళ్ళికొడుకు పేరు రాయకుండా మరేదో రాయించి

Bride: చేతిపై మెహందీతో వరుడి పేరును రాయకుండా భారీ ట్విస్ట్ ఇచ్చిన వధువు.. ఆమె చేతిపైన రాతలను చదివి అవాక్కైన బంధువులు..!

జీవితంలో పెళ్ళనేది(Marriage) చాలా స్పెషల్.. పెళ్ళిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలనేది ఎంతోమంది కల. దీనికోసం విభిన్న పద్దతులు ఫాలో అవుతుంటారు.దీనికి తగ్గట్టుగానే మెహందీ పంక్షన్లు(Mehndi functions), హల్దీ ఫంక్షన్లు(Haldi function) ఏర్పాటు చేస్తుంటారు. సాధారణంగా మెహందీ వేడుకలో అమ్మాయి చేతికి గోరింటాకు పెట్టేటప్పుడు పెళ్ళికొడుకు పేరును(Groom name) రాయడం జరుగుతుంది. కానీ తన మెహందీ వేడుకలో చేతిపైన పెళ్ళికొడుకు పేరు రాయకుండా మరేదో రాయించి అందరికీ భారీ ట్విస్ట్ ఇచ్చింది వధువు. వధువు మెహందీ వేడుకకు సంబంధించిన వీడియో(Bride mehndi video) ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఓ వధువు తన మెహందీ వేడుకలో విభిన్నంగా ఆలోచించింది(Different thought). సాధారణంగా అందరూ చేతిలో వరుడి పేరు రాయించుకుంటారు.కానీ ఈమె మాత్రం వరుడి పేరు రాయించలేదు. దానికి బదులుగా తన చేతిలో కొన్ని తేదీలు(Dates) వేయించుకుంది. అవేంటి అలా తేదీలు వేయించుకున్నావని ఆమె చేతిని చూసిన బంధువులందరూ అవాక్కయ్యారు. అప్పుడు ఆమె ఆ తేదీల గురించి వివరించి. ఆమె చేసుకోబోయేది ప్రేమ వివాహం(Love marriage). ఆమెకు కాబోయే భర్త ఆమెకు ఇన్స్టాగ్రామ్(Instagram) లో పరిచయం అయ్యాడట. వారిద్దరూ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన తేదీ(Intagram introduced date).. ఆ తరువాత అతను ఆమెకు ప్రపోజ్ చేసిన తేదీ(Proposal date).. వారిద్దరూ మొదటిసారి కలుసుకున్న తేదీ(First meet date).. ఆ తరువాత ప్రస్తుతం పెళ్ళిజరగబోతున్న తేదీ(Wedding date).. ఇలా నాలుగు తేదీలను అరచేతిలో వేయించుకుంది. వారిద్దరూ పెళ్ళిదాకా వచ్చారంటే.. వారి పరిచయం, ప్రేమ, వారు కలుసుకున్న రోజు అన్నీ ముఖ్యమైనవేనని ఆ అమ్మాయి ఫీలింగ్. ఆ కారణంతోనే తేదీలు వేయించుకుంది.

Lottery Grand Prize: రూ.44 కోట్లు గెలిచారని ఫోన్ చేస్తే.. సైబర్ నేరగాళ్లేమో అని నెంబర్‌ను బ్లాక్ చేశాడు.. నిజమేనని ఆలస్యంగా తెలిసి..!


మెహందీ ఆర్టిస్ట్(mehndi artist) అమ్మాయి చేతుల్లో తేదీలు వేసి చుట్టూ ఫ్రేమ్ లాగా డిజైన్ వేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను mehndi_by_anku and dishu_Zen అనే ఇన్స్టాగ్రామ్ పేజీ(Intagram page) నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఆ అమ్మాయికి వివాహ శుభాకాంక్షలు(Wedding wishes) చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఆ తేదీల తరువాత ఇంకేంటి విడాకుల తేదీనా(divorce date) అని సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు వీరి ప్రేమ గురించి కథలు చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఈ పెళ్ళికూతురి ఆలోచన ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈమె పెళ్ళి మరింత గొప్ప జ్ఞాపకంగా మారింది

Viral Video: తెలివంటే నీదే బ్రదరూ.. చేతి పంపును అస్సలు ముట్టుకోకుండా నీళ్లను ఎలా బయటకు రప్పించాడో మీరే చూడండి..!


Updated Date - 2023-04-07T18:04:47+05:30 IST