Bride: పెళ్లయిన 4వ రోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నవ వధువు.. అసలు నిజం తెలిసి అవాక్కైన భర్త, అత్తమామలు..!
ABN , First Publish Date - 2023-10-18T14:43:47+05:30 IST
ఆ యువతికి వారం రోజుల క్రితం వివాహం జరిగింది.. మొదటి రాత్రి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆ యువతికి కడుపు నొప్పి వచ్చింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యుడు ఆమె గర్భవతి అని, వెంటనే ఆపరేషన్ చేసి డెలివరీ చేయాలని చెప్పాడు. దీంతో ఆమె భర్త, అత్త మామలు షాకయ్యారు.
ఆ యువతికి (Bride) వారం రోజుల క్రితం వివాహం జరిగింది.. భర్తతో కలిసి అత్తింట్లో అడుగు పెట్టింది.. మొదటి రాత్రి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆ యువతికి కడుపు నొప్పి వచ్చింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యుడు ఆమె గర్భవతి (Pregnant) అని, వెంటనే ఆపరేషన్ చేసి డెలివరీ చేయాలని చెప్పాడు. దీంతో ఆమె భర్త (Husband), అత్త మామలు షాకయ్యారు. వైద్యులు ఆమెకు సర్జరీ చేసి బిడ్డను బయటకు తీశారు. అత్తమామలు నిలదీయగా ఆ యువతి అసలు విషయం బయటపెట్టింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మొరాబాద్లో ఈ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది (Shocking News).
మొరాదాబాద్ జిల్లాలోని అగ్వాన్పూర్కు చెందని యువతికి వార్సీనగర్కు చెందిన యువకుడితో ఈ నెల 11న వివాహం (Marriage) జరిగింది. పెళ్లి సమయంలో అంతా బాగానే ఉంది. పెళ్లి తర్వాత అత్తమామల ఇంటికి చేరుకుంది. ఈ నెల 15న కడుపునొప్పి వచ్చింది. బాలికకు కడుపునొప్పి రావడంతో భర్త ఆందోళన చెంది ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమె గర్భవతి అని తేల్చని వైద్యులు ఆపరేషన్ చేసి ఆడబిడ్డను బయటకు తీశారు. దీంతో భర్త, అత్తమామలు షాక్ అయ్యారు. ఆ యువతిని, ఆమె తల్లిదండ్రులను నిలదీశారు. అప్పుడు ఆ యువతి అసలు విషయం చెప్పింది.
Tea Seller Video: ఏం టాలెంట్ సామీ.. ఇతడి టీ దుకాణం వద్దకు జనాలు ఎందుకు ఇంతగా క్యూ కడుతున్నారంటే..!
తన పొరుగింట్లో ఉండే యువకుడితో తనకు ప్రేమ వ్యవహారం ఉందని, అతడి వల్లనే గర్భవతి అయ్యానని చెప్పింది. దీంతో భర్త ఆమెను బిడ్డతో సహా ఇంట్లో నుంచి గెంటేశాడు. దీంతో ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. గ్రామ పెద్దలు పంచాయితీ ఏర్పాటు చేసి ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో ఆ యువతి తన బిడ్డతో సహా ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది. పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు.