Bride Video: ఏం మనిషివయ్యా..? పెళ్లి రోజే వధువుకు నరకం చూపించావంటూ వరుడిపై ఆగ్రహం.. అసలేం జరిగిందో చూస్తే..!
ABN , First Publish Date - 2023-07-24T09:52:54+05:30 IST
తండ్రి తరువాత ఆడపిల్లకు భరోసా ఇచ్చేది, బాధ్యతగా చూసుకునేది, అర్థం చేసుకునేది భర్తే అవుతాడు. కానీ ఈ వధువుకు మాత్రం పెళ్ళిరోజే..
ప్రతి ఆడపిల్ల తన జీవితంలో భర్త గురించే ఎక్కువగా ఆశ పడుతుంది. తండ్రి తరువాత ఆడపిల్లకు భరోసా ఇచ్చేది, బాధ్యతగా చూసుకునేది, అర్థం చేసుకునేది భర్తే అవుతాడు. కానీ భర్త ప్రవర్తన సరిగా లేకపోతే ఆ అమ్మాయి జీవితం పెద్ద నరకంలా తయారవుతుంది. సాధారణంగా ఇలాంటి ప్రవర్తన పెళ్లి తరువాత కొన్నిరోజులకు బయటపడుతూ ఉంటుంది. ఓ అమ్మాయి పెళ్ళిలో మాత్రం ఇది పెళ్లిరోజే బయటపడటం గమనార్హం. ఆ వరుడి ప్రవర్తన చూసిన నెటిజన్లు 'పాపం ఆ వధువుకు పెళ్ళి రోజే నరకం చూపించాడు' అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ప్రతి ఆడపిల్ల జీవితంలో పెళ్లి(Marriage) ఒక పెద్ద మలుపు. పెళ్లిలో వధూవరులు ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు. వివిధ సందర్బాలలో వారిరువురి మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత బయటపడుతూ ఉంటుంది. వీడియోలో ఓ పెళ్ళివేడుక ఎంతో ఘనంగా జరిగింది. దీని తరువాత డీజే ఏర్పాటు చేశారు. పెళ్ళికి విచ్చేసిన బంధువులు, కొందరు అతిథులు ఈ డీజె ను ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు కొత్త జంట వేదిక పైన డాన్స్ చెయ్యడం మొదలుపెట్టింది. బాలీవుడ్ సినిమా పద్మావత్ నుండి ఘూమర్-ఘూమర్ పాట ప్లే అవుతుండగా పాటకు తగ్గట్టు వరుడు(groom) వధువు(bride) చేయి పట్టుకుని ఆమెను గుండ్రంగా తిప్పుతున్నాడు. పెళ్లి కారణంగా సరైన తిండి, నిద్ర లేని ఆమె చాలాసేపు నాన్-స్టాప్ గా తిరగడంతో స్పృహ తప్పి పడిపోయింది(bride fainting). అయితే ఇలా జరిగిన వెంటనే ఏ వరుడు అయినా ఆందోళన పడతాడు, వెంటనే వధువును పైకి లేపి సపర్యలు చేయడం వంటివి చేస్తాడు. కానీ ఈ వరుడు మాత్రం తనకేమీ పట్టనట్టు ప్రవర్తించాడు. ఆమె కింద పడిపోతుంటే కనీసం ఆమెను పట్టుకోవాలనే ప్రయత్నం కూడా చెయ్యకుండా బండరాయిలా అలాగే నిలుచున్నాడు. వధువు కింద పడిపోయిన తరువాత ఎలాంటి ఆందోళన చెందకుండా చూస్తూ ఉండిపోయాడు. వేరే మహిళ ముందుకొచ్చి ఆ వధువును చూసుకోవాల్సి వచ్చింది. ఆమె అలా చూసుకుంటూ ఉంటే కనీసం ఏమయ్యిందని తెలుసుకోకుండా అతను అక్కడి నుండి వెనక్కు వెళ్లిపోయాడు. దీన్ని బట్టి అతనికి భార్య పట్ల ఏమాత్రం బాధ్యత, ప్రేమ లేదనే విషయం అర్థమైపోతోంది.
Health Tips: ఎక్కువ మొత్తం పాల ప్యాకెట్స్ తెచ్చి వాడుకునే అలవాటుందా? ఎవ్వరికీ తెలియని షాకింగ్ నిజాలివీ..
ఈ వీడియోను manu_choudary_bmr61 అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వరుడి ప్రవర్తన చూసి ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 'అతనిలో ఎంత అహంకారం ఉందో..' అని ఒకరు కామెంట్ చేశారు. 'వాడేం భర్త, ఆ అమ్మాయి అలా పడిపోతుంటే కనీసం ఆమెను పైకి లేపాలనే ఇంగితం లేదు' అని ఇంకొకరు అన్నారు. 'ఇలాంటి భర్తలను ముక్కలుగా నరికెయ్యాలి' అని ఆవేశపడుతున్నారు. 'పాపం ఆ వధువుకు పెళ్లిరోజే నరకం చూపించాడు, ఆమె భవిష్యత్తు ఏమిటో' అని ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.