Bulls Fight: రెండు ఆంబోతుల ఫైటింగ్.. సడన్‌గా వాటి మధ్యలోకి మరో ఆంబోతు ఎంట్రీ.. మూడూ కలిసి కారు ఓనర్‌కు భారీ షాకిచ్చాయ్..!

ABN , First Publish Date - 2023-07-04T14:51:16+05:30 IST

అప్పుడప్పుడు రోడ్ల మీద వెళ్తున్న ఆవులు, గేదెలు, ఆంబోతులు ఒకదానిపై మరొకటి కాలు దువ్వుతుంటాయి. రోడ్డు మీదే భీకర పోరు సాగిస్తాయి. ఆ సమయంలో రోడ్డు మీద ఏవి ఉన్నా అవి పట్టించుకోవు. వాటి భారీ శరీరాల ధాటికి అవి నుజ్జునుజ్జు కావాల్సిందే. మనుషులు ఉంటే గాయపడాల్సిందే.

Bulls Fight: రెండు ఆంబోతుల ఫైటింగ్.. సడన్‌గా వాటి మధ్యలోకి మరో ఆంబోతు ఎంట్రీ.. మూడూ కలిసి కారు ఓనర్‌కు భారీ షాకిచ్చాయ్..!

అప్పుడప్పుడు రోడ్ల మీద వెళ్తున్న ఆవులు, గేదెలు, ఆంబోతులు ఒకదానిపై మరొకటి కాలు దువ్వుతుంటాయి. రోడ్డు మీదే భీకర పోరు సాగిస్తాయి. ఆ సమయంలో రోడ్డు మీద ఏవి ఉన్నా అవి పట్టించుకోవు. వాటి భారీ శరీరాల ధాటికి అవి నుజ్జునుజ్జు కావాల్సిందే. మనుషులు ఉంటే గాయపడాల్సిందే. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (Bulls fight on the road). ఆ వీడియో చూసి చాలా మంది కార్ల యజమానులు పార్కింగ్ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

@gharkekalesh అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ రోడ్డుపై రెండు ఆంబోతులు ఫైటింగ్‌కు దిగాయి. వెనుక నుంచి మూడో ఆంబోతు వచ్చి ఆ ఫైటింగ్‌లో జాయిన్ అయింది. దాంతో ఆ మూడు ఆ ఇరుకు రోడ్డు మీదే పరుగులు ప్రారంభించాయి. ఆ రోడ్డు మీద ఓ కారు కూడా పార్క్ చేసింది (Car parking). ఓ ఎద్దు ఏకంగా కారు పైకి ఎక్కేసింది. దీంతో కారు బానెట్, ముందు అద్దం పగిలిపోయాయి. శబ్దం విన్న చుట్టు పక్కల వారు వెంటనే వచ్చి ఆ ఆంబోతులను తరిమేశారు. అయితే అప్పటికే ఆ కారు ముందు భాగం బాగా దెబ్బతింది (Bull damages car).

Viral Video: కాలం కలిసి రాక ఇలా అయిపోయాడు కానీ.. లేకుంటే సెలబ్రెటీ అయేవాడేమో.. ఈయన టాలెంట్‌ ఏంటో చూస్తే..!

ఈ ఘటన మొత్తం ఆ వీధిలో అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయింది. ఆ వీడియోను ఇప్పటివరకు 1.6 లక్షల మంది వీక్షించారు. చాలా మంది ఆ షాకింగ్ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``రోడ్లపై కార్లు పార్క్ చేయడం వల్ల ఇలాంటి నష్టాలు తప్పవు``, ``పాపం.. ఆ కారు యజమాని``, ``ఇందులో తప్పెవరిది`` అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-04T14:51:16+05:30 IST