Cabbage: ఇక్కడ క్యాబేజీ కిలో ఎంత తెలుసా.. కేవలం రూ.1 మాత్రమే..
ABN , First Publish Date - 2023-05-23T13:24:14+05:30 IST
పంట చేతికొచ్చే సమయం లో ధరలు అమాంతం పడిపోవడంతో క్యాబేజీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరంబూర్(చెన్నై): పంట చేతికొచ్చే సమయం లో ధరలు అమాంతం పడిపోవడంతో క్యాబేజీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోడ్ జిల్లాలో తాళవాడి, కొంగళ్లి, పనహళ్లి, తోట్టకాజనూరు, బారతిపురం సహా 80 కొండ గ్రామాల్లో ప్రజలు వంకాయ, బెండ, బీట్‌రూట్, తెల్ల ముల్లంగి, క్యాబేజీ, కాలిఫ్లవర్, బీన్స్ తదితరాలు సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 100 ఎకరాల్లో సాగు చేసిన క్యాబేజీ కోతకు రాగా, ప్రస్తుతం ధర గణనీయంగా పడిపోయింది. ఈ విషయమై రైతు జ్ఞానశేఖరన్ మాట్లాడుతూ... ఐదెకరాల్లో క్యాబేజీ సాగు చేశానని, పంట చేతికొచ్చిన సమయంలో కిలో రూ.1కి వ్యాపారులు కొనుగోలు చేస్తామని చెబుతున్నారన్నారు. అదే సమయంలో చిల్లర దుకాణాలో కిలో రూ.30 ధర పలుకుందున్నారు. ఎకరా సాగుకు రూ.80 వేల వరకు ఖర్చవుతుండగా, ప్రస్తుతమున్న ధరకు విక్రయిస్తే తమకు రవాణా ఖర్చులు కూడా రావన్నారు. ప్రభుత్వమే గిట్టుబాటు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని జ్ఞానశేఖరన్ కోరారు.