IQ Test: మీరు నిజంగా తెలివైన వారైతే.. ఈ ఫొటోలో దాగి ఉన్న 'డబ్ల్యూ'ను 11 సెకన్లలోపు కనిపెట్టండి? చూద్దాం!
ABN , First Publish Date - 2023-12-09T08:41:46+05:30 IST
Viral Brain Teaser: చాలా మంది పజిల్స్ (Puzzles) సాల్వ్ చేయడం అనే దాన్ని ఎంతో ఇష్టంగా చేస్తుంటారు. ఇది చాలా సరదాగా కూడా ఉంటుంది. ఈ పజిల్ సాల్వింగ్ మన బ్రెయిన్‌కు పనిపెట్టే ఒక మంచి ఎక్సర్‌సైజ్ అని చెప్పొచ్చు.
Viral Brain Teaser: చాలా మంది పజిల్స్ (Puzzles) సాల్వ్ చేయడం అనే దాన్ని ఎంతో ఇష్టంగా చేస్తుంటారు. ఇది చాలా సరదాగా కూడా ఉంటుంది. ఈ పజిల్ సాల్వింగ్ మన బ్రెయిన్‌కు పనిపెట్టే ఒక మంచి ఎక్సర్‌సైజ్ అని చెప్పొచ్చు. ఇలా మెదడును ఆలోచింపజేసేలా చేసే ఈ బ్రెయిన్ టీజర్స్ (Brain Teasers) ను సరికొత్తగా సాల్వ్ చేయడం ఇంకాస్త ఫన్‌ను జోడిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఒక బ్రెయిన్ టీజర్ తెగ వైరల్ అవుతోంది. చాలా సింపుల్‌గా కనిపించినా దీనిని సాల్వ్ చేయాలంటే కాస్తా టైమ్ పడుతుంది. అయితే, కొంచెం తెలివిగా ఆలోచిస్తే మాత్రం ఇట్టే పరిష్కరించవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఓ 11సెకన్లలోపు మీరు ఈ బ్రెయిన్ టీజర్‌ను సాల్వ్ చేస్తే మాత్రం మీరు నిజంగా తెలివైన వారు అని అనుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Tomato: అంతరిక్షంలో కనిపించకుండాపోయిన టమాటా.. 8 నెలల తర్వాత దొరికింది.. అసలేం జరిగిందంటే..!
ఇంతకీ పజిల్ ఏంటంటే..
ఈ పజిల్‌లో 12 అడ్డువరసలు, 18 నిలువు వరసలతో ఒక ఫొటో ఉంది. అందులో అన్ని వరుసలలో 'ఎం' అనే అక్షరం మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ, వాటి మధ్యలోనే ఒక 'డబ్ల్యూ' అనే అక్షరం దాగి ఉంది. దాన్ని మనం 11సెకన్లలోపు కనిపెట్టగలగాలి. ఇక దీనికోసం మనం చాలా జాగ్రత్తగా, తీక్షణంగా ఫొటోను గమనించాల్సి ఉంటుంది. అప్పుడే వేగంగా సరైన సమాధానం చెప్పగలం. మీరు ఒకసారి మీ బుర్రకు పని చెప్పండి చూద్దాం. ఎంత వేగంగా సమాధానం చెప్పగలరో ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి సరియైన సమాధానం వచ్చేసి.. పైనుంచి ఆరో అడ్డు వరుసలో నాల్గో అక్షరం. ఇక్కడే మనకు 'డబ్ల్యూ' అనే అక్షరం కనిపిస్తుంది. మిగతావన్నీ 'ఎం' అక్షరాలు మాత్రమే. ఇంతకీ మీరు చెక్ చేసుకున్నారా? మీకు ఎంత సమయం పడుతుందో..!
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.