Chennai: జాలర్ల వలకు అరుదైన ‘సెరుప్పు’ చేపలు.. రూ.30 కోట్లకు ఎగుమతి

ABN , First Publish Date - 2023-09-18T10:48:35+05:30 IST

స్థానిక కాశిమేడు జాలర్ల వలలో చిక్కుకున్న అరుదైన ‘సెరుప్పు’ చేపలను రూ.30 కోట్లకు విదేశాలకు ఎగుమతి చేశారు. కాశిమేడు ఫిషింగ్‌ హార్బర్‌లో

Chennai: జాలర్ల వలకు అరుదైన ‘సెరుప్పు’ చేపలు.. రూ.30 కోట్లకు ఎగుమతి

ఐసిఎఫ్‌(చెన్నై): స్థానిక కాశిమేడు జాలర్ల వలలో చిక్కుకున్న అరుదైన ‘సెరుప్పు’ చేపలను రూ.30 కోట్లకు విదేశాలకు ఎగుమతి చేశారు. కాశిమేడు ఫిషింగ్‌ హార్బర్‌లో 700లకు పైగా మోటరు పడవల్లో జాలర్లు నడి సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. జూలై నుంచి శనివారం వరకు జాలర్ల వలలో లెథర్‌ జాకెట్‌ అనే అరుదైన చేపలు టన్నుల కొద్దీ చిక్కుకున్నాయి. తమిళంలో సెరుప్పు పేరుతో పిలిచే ఈ రకం చేపలు సాధారణంగా 100 టన్నుల మాత్రమే లభిస్తాయి. అయితే ఈ ఏడాది లక్ష లన్నుల వరకు లభించాయి. ఈ చేపలను ఎవరూ తినకపోయినా, వాటి చర్మాన్ని విదేశాల్లో కోటు, టోపీలు వంటి తయారీకి వినియోగిస్తున్నారు. కిలో చేపలు రూ.300 విక్రయిస్తున్నారు. ఆ ప్రకారం, రూ.30 కోట్ల విలువైన చేపలు ఎగుమతి చేసినట్లు జాలర్లు తెలిపారు.

Updated Date - 2023-09-18T10:48:35+05:30 IST