Share News

Chennai: కాలయార్‌ ఆలయంలో రోమన్‌ నాణెం

ABN , First Publish Date - 2023-11-03T11:55:29+05:30 IST

శివగంగ జిల్లా కాలయార్‌కోయిల్‌ సమీపంలోని ఇలందకరైలో రోమన్‌ నాణెం, సింధు నాగరికత కాలం నాటి షర్ట్‌ బటన్‌ పురావస్తు

Chennai: కాలయార్‌ ఆలయంలో రోమన్‌ నాణెం

ఐసిఎఫ్‌(చెన్నై): శివగంగ జిల్లా కాలయార్‌కోయిల్‌ సమీపంలోని ఇలందకరైలో రోమన్‌ నాణెం, సింధు నాగరికత కాలం నాటి షర్ట్‌ బటన్‌ పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయమై పురావస్తు పరిశోధకుడు రమేష్‌ మాట్లాడుతూ, ఇలందకరై మేట్టు ప్రాంతంలో రెండువేల ఏళ్ల క్రితం నాటి మగధ సామ్రాజ్యానికి చెందిన వెండి ముద్ర నాణెం, 13వ శతాబ్దానికి చెందిన సిరియా దేశపు బంగారు నాణెం లభించగా, ప్రస్తుతం రోమన్‌ దేశ నాణెం గుర్తించామన్నారు. దీని ద్వారా ఈ ప్రాంతం అంతర్జాతీయ వాణిజ్య కేంద్రమై ఉంటుందని తెలిపారు. రోమన్‌ నాణెం 13 మి.మీ వ్యాసం, 1.40 గ్రాముల బరువు రాగితో తయారైందని, నాణెం ఒకవైపు రోమన్‌ చక్రవర్తి బొమ్మ, మరోవైపు ఆలివ్‌ ఆకుల మధ్య కొన్ని అక్షరాలు కనిపిస్తున్నాయని, సింధు లోయ, మొహంజుదారో, అరప్ప ప్రాంతాల్లో లభించినట్లు చొక్కా బొత్తాము లభించిందని పేర్కొన్నారు.

Updated Date - 2023-11-03T11:55:30+05:30 IST