Chennai: చెన్నైలో రూ.14 కోట్లకు పొట్టేళ్ల విక్రయం

ABN , First Publish Date - 2023-06-28T09:06:44+05:30 IST

బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని నగరంలోని పుళియంతోపు, ఆట్టుదొడ్డి, రెట్టేరి సంత, తాంబరం సంతలలో పొట్టేళ్ల విక్రయాలు

Chennai: చెన్నైలో రూ.14 కోట్లకు పొట్టేళ్ల విక్రయం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని నగరంలోని పుళియంతోపు, ఆట్టుదొడ్డి, రెట్టేరి సంత, తాంబరం సంతలలో పొట్టేళ్ల విక్రయాలు ఊపందుకున్నాయి. నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర(Andhra Pradesh, Telangana, Karnataka, Maharashtra) తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు పొట్టేళ్లను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఈ రాష్ట్రాల నుంచి సుమారు 70వేల వరకూ పొట్టేళ్లు, మేకలను దిగుమతి చేసుకున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం వరకూ రూ.14 కోట్ల మేరకు పొట్టేళ్లను విక్రయించినట్లు తెలిపారు. రెట్టేరి సంతలో రూ.5కోట్ల వరకూ పొట్టేళ్లను విక్రయించారు. ఈ పొట్టేళ్లను రూ.10వేల నుంచి రూ.50వేల ధరలకు విక్రయించినట్లు వ్యాపారులు చెప్పారు. మాధవరం సంతలోనూ బక్రీద్‌ పొట్టేళ్ల అమ్మకాలు చురుకుగా కొనసాగుతున్నాయి.

Updated Date - 2023-06-28T09:06:44+05:30 IST